Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

24-Sep-2016 12:05:10
facebook Twitter Googleplus
Photo

బాహుబలి మూవీ చాలామందికి లైఫ్ ఇచ్చేసింది. వాళ్ల కెరీర్ లకు బిగ్ టర్నింగ్ అయిపోయింది. బాహుబలితో బాగా ప్రయోజనం పొందిన వారిలో.. విలన్ కాలకేయుడు పాత్రలో నటించిన ప్రభాకర్ ఒకరు. ఇప్పుడీ నటుడికి మలయాళ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. ఏకంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కి మెయిన్ విలన్ చేయబోతున్నాడట కాలకేయుడు.

రీసెంట్ గా జనతా గ్యారేజ్ తో ఆకట్టుకున్న మోహన్ లాల్.. త్వరలో కొత్త సినిమా స్టార్ట్ చేయనున్నాడు. బి. ఉన్నికృష్ణన్ డైరెక్షన్ లో రూపొందనున్న ఈ చిత్రంలో.. ప్రభాకర్ ను మెయిన్ విలన్ గా తీసుకుంటున్నారట. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ మూవీలో.. పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నెగిటివ్ రోల్ పోషించనుండగా.. ప్రభాకర్ దే మెయిన్ విలన్ రోల్ అని తెలస్తోంది. పృథ్వీ రాజ్ చేయనున్నది.. ఈ కాలకేయుడికి అసిస్టెంట్ రోల్ అంటున్నారు.

బాహుబలి తర్వాత అదే జోష్ లో.. వరుసగా సినిమాలు యాక్సెప్ట్ చేసిన ప్రభాకర్.. సక్సెస్ ని మాత్రం టేస్ట్ చేయలేకపోయాడు. కానీ ఇప్పటివరకూ చిన్నా చితకా సినిమాలను చేయగా.. ఇప్పుడు ఏకంగా ఇండస్ట్రీ టాప్ లో ఉండే మోహన్ లాల్ కి విలన్ నటించనుండడం విశేషం.

,  ,  ,  ,  ,  ,  ,