Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

21-Dec-2017 12:49:54
facebook Twitter Googleplus
Photo

సీరియల్స్ లో నటించేవారు సినిమాల్లోకి కూడా వస్తున్నారు. ముఖ్యంగా లేడి సీరియల్ యాక్టర్స్ అయితే సినిమాలో కొన్ని ప్రయోగాత్మకమైన పాత్రలను చేస్తూ చాలా మెప్పిస్తున్నారు. ఇక కొంత మంది యంగ్ యాక్టర్స్ కూడా సినిమాల్లో కథానాయికగా కనిపించడానికి సై అంటున్నారు. ఈ మధ్య కాలంలో నార్త్ సీరియల్స్ నుంచి వచ్చి సౌత్ సినిమాలలో తెగ ఆకట్టుకుంటున్నారు.

అయితే డైరెక్ట్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చిన కొంతి మంది భామలు మాత్రం చాలా లెట్ గా సీరియల్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా అవకాశాలు తగ్గితే ఆ విధంగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇకపోతే టాప్ హీరోయిన్స్ గా కొనసాగుతోన్న కొంతమంది సీరియల్స్ లో నటించడానికి కూడా రెడీ అంటున్నారు. అందులో మొదటగా ఇలియానా ఎలాంటి అభ్యంతరాలను చెప్పడం లేదు. టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో విజయాలను చుసిన ఈ భామ ప్రస్తుతం బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న సంగతి తెలిసిందే.

అయితే మంచి క్యారెక్టర్ లభిస్తే తప్పకుండా సీరియల్స్ లో నటిస్తాను అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.తనకు కూడా సీరియల్స్ అంటే చాలా ఇష్టమని అందులో కూడా ఎమోషన్స్ తో కూడుకున్న సన్నివేశాలు బావుంటాయని చెబుతూ... బుల్లి తెరపై గుర్తుండిపోయే అవకాశం కోసం వస్తే ఎలాంటి అడ్డు చెప్పను అని అమ్మడు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

,  ,  ,  ,