Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2016 14:06:34
facebook Twitter Googleplus
Photo

అదేంటి నయన్ ఐటెం సాంగ్స్ చేయడం ఏంటి అనుకుంటున్నారా? అందులో అనుకునేది ఏముంది.. ఆమె ఎప్పుడో అలాంటి పాటలు చేసేసింది. అయితే అవన్నీ ఎక్కువగా సూపర్ స్టార్ రజనీకాంత్ తో మాత్రమే చేసింది. 'శివాజి' సినిమాలో సినిమా మొదలవ్వగానే వచ్చే మొదటి సాంగులో నయన్ ఉంటుంది. అలాగే 'చంద్రముఖి' సినిమాలో పనమ్మాయ్ గా సినిమా అంతటా ఉన్నా.. ఒక్క పాటలో మాత్రమే రజనీతో మెరిసింది. ఇక 'కథానాయకుడు' సినిమాలో కూడా అంతే.. రియల్ హీరోయిన్ గా ఒక పాటలో కనిపిస్తుంది. ప్రతీసారి అలా రజనీకాంత్ కు ఆమె ఐటెం గాళ్ అయిపోనట్లేగా మరి. అయితే ప్రతీసారీ ఐటెంగా చేస్తున్న నయన్ కు ఈసారి మాత్రం హీరోయిన్నుగా చేసే ఛాన్సొచ్చేలా ఉంది.

ప్రస్తుతం రజనీకాంత్ ''రోబో 2.0'' సినిమా షూటింగులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత ఆయన ధనుష్ ప్రొడక్షన్లో పా.రంజిత్ డైరక్షన్లో మరో సినిమాను చేస్తున్నారు. ఇది కబాలి సినిమా సీక్వెల్ కాదని ఆల్రెడీ రంజిత్ క్లారిటీ కూడా ఇచ్చాడు. మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా అమలా పాల్ ను అనుకున్నప్పటికీ.. మరో హీరోయిన్ కు ఛాన్సుందట. అందుకే ఆ పాత్రకు నయనతారను తీసుకోవాలని చూస్తున్నారట. ఒక ప్రక్కన నయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ రజనీ సినిమా అంటే డేట్స్ మాత్రం ఇస్తుంది. పైగా ఈసారి హీరోయిన్ ఛాన్సు కాబట్టి.. మిస్ చేసుకోదనే అందరూ అనుకుంటున్నారు. ఒకవేళ నయన్ మిస్ అయితే మాత్రం ఆ పాత్ర త్రిషను వరించే ఛాన్సుందట.

,  ,  ,  ,  ,