Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2016 10:26:59
facebook Twitter Googleplus
Photo

చెయ్యి చూశావా ఎంత రఫ్‌గా ఉందో.. రఫ్‌ ఆడించేగలను? అంటూ ?గ్యాంగ్‌లీడర్‌?గా చిరు చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఈ సినిమాతో మెగాస్టార్ మాస్ ఇమేజ్ మరోమెట్టు ఎక్కింది. అభిమానుల్లో ఆయన స్టైల్ ఓ ట్రెండ్ సృష్టించింది. చొక్కా కాలర్‌ ఎగరేస్తూ చిరు ఈ సినిమాలో ఇచ్చిన పోజు ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. అందుకే ఆ స్టైల్‌ నే ఈ బుజ్జీ మెగా హీరో ఇమిటేట్ చేశాడు.

ఇంతకు ఈ ఛోటా 'గ్యాంగ్ లీడర్' ఎవరు అని అనుకుంటున్నారా.. నాగాబాబు తనయుడు, 'కంచె' హీరో వరుణ్ తేజ్. చిన్నప్పుడే పెద్దనాన్న స్టైల్‌ ఫిదా అయిపోయిన వరుణ్ అప్పట్లోనే ఇలా గ్యాంగ్ లీడర్ ఫోజు ఇచ్చాడు. ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఈ ఫొటోను ఆయన తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఆ బడా గ్యాంగ్ లీడర్ లాగే .. ఈ ఛోటా గ్యాంగ్ లీడర్ కూడా అభిమానులకు తెగ నచ్చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,  ,