Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

05-Dec-2014 10:57:38
facebook Twitter Googleplus
Photo

ఇటీవల 'కత్తి' వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన తమిళ హీరో విజయ్ నటించే తదుపరి చిత్రం ఖరారైంది. ప్రస్తుతం విజయ్ తన 58వ చిత్రంలో నటిస్తున్నాడు. సోషియో ఫ్యాంటసీ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శింబు దేవన్ దర్శకత్వం వహిస్తున్నాడు. దీని తర్వాత అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో నటిస్తాడు. కొత్త సంవత్సరంలో సెట్స్ కి వెళ్లే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక 60వ చిత్రానికి ప్రముఖ చాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తాడు. ఆయన చెప్పిన కథకు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇది వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ కి వెళుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో దీనిని నిర్మిస్తారు.

,  ,  ,  ,  ,