Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Nov-2016 11:09:42
facebook Twitter Googleplus
Photo

అష్టాచెమ్మాతో ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ.. రీసెంట్ గా జెంటిల్ మన్ తో మళ్లీ ఫాంలోకి వచ్చేశాడు. అదే స్పీడ్ తో కొత్త ప్రాజెక్టులను కూడా రెడీ చేసేసుకుంటున్నాడనే వార్తలు ఇప్పటికే ఉన్నాయి. అక్కినేని నాగచైతన్యతో ఇంద్రగంటి మూవీ చేస్తాడనే టాక్ గట్టిగానే నడిచింది.

అయితే ప్రేమమ్ తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి.. బ్లాక్ బస్టర్ కి అడుగు దూరంలో ఆగిపోయిన చైతు.. ఫ్యూచర్ ప్రాజెక్టులపై మరింత కేర్ ఫుల్ గా ఉండాలని డిసైడ్ కావడంతో.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ ప్రాజెక్టు కష్టాల్లో పడిందని.. ఇప్పటికే ఆగిపోయిందనే సిగ్నల్స్ అందేశాయనే టాక్ వినిపిస్తోంది. ప్రేమమ్ తర్వాత సాహసం శ్వాసగా రిలీజ్ అయినా.. అది ఎప్పుడో ఏడాది క్రితం రిలీజ్ కావాల్సిన మూవీ. ప్రేమమ్ తర్వాత చైతు యాక్సెప్ట్ చేశాడని మూడు ప్రాజెక్టులపై వార్తలు రాగా.. సోగ్గాడే డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ సినిమా డిసెంబర్ 4నుంచి షూటింగ్ ప్రారంభం కానుంది.

ఇప్పుడు ఇంద్రగంటితో చేసే సినిమాను రద్దు చేసుకుని.. చంద్రశేఖర్ యేలేటి మూవీకి మొగ్గుతున్నాడట చైతు. ఈ ప్రాజెక్టు ఆగిపోతుందనే సమాచారం ఉన్న ఇంద్రగంటి.. ఇక ఆశలు పెట్టుకోకుండా.. సితార ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ పై ఓ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నాడట. అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయకముందే జెంటిల్మన్ గా ఝలక్ ఇచ్చేశాడు చైతు అనుకుంటున్నారు ఫిలింనగర్ జనాలు.

,  ,  ,  ,  ,