Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 12:01:21
facebook Twitter Googleplus
Photo

కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ బోలెడంత క్రేజ్ ఉన్న హీరో చియాన్ విక్రమ్. ఈ మధ్య సరైన హిట్ ఒక్కటి కూడా లేక ఇబ్బంది పడుతున్న విక్రమ్.. లేటెస్ట్ గా ఇరుగమన్.. తెలుగులో ఇంకొక్కడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. యథావిథిగా ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీకి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. కాని ఇప్పుడు అక్కడే ట్విస్టంతా ఉంది.

డివైడ్ టాక్ వచ్చిన సినిమాలైనా పుంజుకున్న చరిత్రలు ఇప్పటివరకూ చాలానే ఉన్నాయ్ కానీ.. విచిత్రంగా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన ఇంకొక్కడు.. వంద కోట్ల మార్క్ అందుకుంటూ.. పెద్ద షాక్ నే ఇచ్చాడు. ఇంకొక్కడులో ఫస్టాఫ్ వరకూ సూపర్ గా ఉన్నా.. సెకండాఫ్ తేలిపోయిందనే కామెంట్స్ ఉన్నాయి. అద్భుతమైన తొలి భాగం ముందు.. రొటీన్ గా సాగే మలి భాగం నెగిటివ్ అంటూ క్రిటిక్స్ విమర్శించారు. విక్రమ్ కెరీర్ లో మరో డిజాస్టర్ అని తేల్చేశారు. కానీ ఇంకొక్కడు తొలివారంలోనే 50 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఈ ఆదివారం వరకూ తెలుగు-తమిళ్ వెర్షన్స్ కలిపి 90.07 కోట్ల రూపాయల గ్రాస్ ను సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతే కాదు.. వంద కోట్ల క్లబ్ లో ఇంకొక్కడు ఎంట్రీ ఖాయమని కూడా అంటున్నాయి.

సైంటిఫిక్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు బాగానే ఆదరించారనే విషయం అర్ధమవుతోంది. ముఖ్యంగా హిజ్రా గెటప్ లో విక్రమ్ కనబరిచిన వైవిధ్యభరితమైన నటన.. క్రిటిక్స్ ని మెప్పించలేకపోయినా.. ఆడియన్స్ ను మాత్రం థియేటర్లకు రప్పించగలిగిందన్న మాట.

,  ,  ,  ,  ,  ,  ,