Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

25-May-2016 14:52:37
facebook Twitter Googleplus
Photo

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా ఎట్టకేలకు విడుదల తేదీ ఖరారు చేసుకుంది. ఏడాదిన్నర కిందట మొదలైన అక్కినేని నాగచైతన్య సినిమా ?సాహసం శ్వాసగా సాగిపో? ఇంకో 50 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జులై 15న తెలుగు-తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్. ?సాహసం శ్వాసగా సాగిపో?ను తెలుగులో నిర్మిస్తున్న కోన వెంకట్ అన్నట్లే ఇవాళ గౌతమ్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించాడు. జూన్ 17న ఆడియో రిలీజ్ చేయబోతున్నట్లు కూడా వెల్లడించాడు. గత ఏడాది దీపావళికే వస్తుందనుకున్న సినిమా ఇది. ఇంత ఆలస్యంగా రాబోతోంది.

ఈ ఆలస్యానికి ప్రధాన కారకుడు శింబునే. తమిళంలో ఈ చిత్రాన్ని శింబు హీరోగానే మొదలుపెట్టాడు గౌతమ్. ఇంతకుముందు ?ఏమాయ చేసావె?ను కూడా తమిళంలో శింబుతోనే తీసిన గౌతమ్.. ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న సినిమాకు కూడా అతణ్నే హీరోగా ఎంచుకున్నాడు. తెలుగు-తమిళ వెర్షన్లు రెండూ ఒకే లొకేషన్లలో సమాంతరంగా షూట్ చేయడం ఇబ్బందిగా మారింది. ఐతే అనేక వివాదాల్లో చిక్కుకున్న శింబు ఈ సినిమా షూటింగుకి సరిగా రాకపోవడంతో చైతూ డేట్లు కూడా చాలా వరకు వేస్టయ్యాయి. గౌతమ్ మీద ఉన్న గౌరవంతో చైతూ సర్దుకుపోయాడు. చాన్నాళ్ల తర్వాత శింబు అందుబాటులోకి రావడంతో ఈ మధ్య క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేశారు. రెండు వెర్షన్లలోనూ మలయాళ భామ మాంజిమా మోహన్ కథానాయికగా నటించిన ఈ సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీత దర్శకుడు.

,  ,  ,  ,  ,  ,