Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Jun-2016 12:55:57
facebook Twitter Googleplus
Photo

వరుస హిట్స్‌తో జోరు మీదున్న నాని, అదే ఉత్సాహంతో తన కొత్త సినిమా ?జెంటిల్‌మన్‌?ను విడుదలకు సిద్ధం చేసేశారు. ?అష్టాచమ్మా?తో తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణతో కలిసి నాని చేసిన ఈ సినిమా, అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే నాని అండ్ టీమ్ సినిమా ప్రమోషన్స్‌తో బిజీ బిజీగా గడిపేస్తున్నారు.
ఇక ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ?జెంటిల్‌మన్? సినిమాకు ఇంటర్వెల్ ఓ మేజర్ హైలైట్‌గా నిలవనుందని, కచ్చితంగా ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఈ బ్లాక్ ఉంటుందని హీరో నాని తెలిపారు. ఓ రొమాంటిక్ థ్రిల్లర్‌గా, తెలుగు సినిమాకు పరిచయం లేని కథాంశంతో వస్తుందన్న ప్రచారం పొందిన ఈ సినిమాపై అంతటా భారీ అంచనాలే ఉన్నాయి. నాని సరసన సురభి, నివేద థామస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ అందించిన ఆడియో ఇప్పటికే మంచి ఆదరణ తెచ్చుకుంది.

,  ,  ,  ,  ,  ,