Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

03-Jul-2017 16:58:47
facebook Twitter Googleplus
Photo

క్రేజ్ పెంచుకునేందుకు సోయగాలను ప్రదర్శించడం అనే ట్రెండ్ పాతదే కానీ.. ఈ మధ్య కాలంలో ఈ అందాల డోస్ మరీ ఎక్కువైపోతోంది. బ్యాక్ లెస్ ల నుంచి టాప్ లెస్ ల వరకూ ట్రెండ్ పాకేసింది.

బాలీవుడ్ లో సెటిల్ అయిన శ్రీలంక అందం జాక్వెలిన్ ఫెర్నాండెజ్.. రీసెంట్ గా ఓ ఫోటో షూట్ చేసింది. ఓ ఫోటో కోసం అయితే ఏకంగా టాప్ లెస్ పోజులు ఇచ్చేసింది. అలాగని ఈమె తన పరువాలను పబ్లిక్ చేసేయకుండా.. కురులతో షోకులను కవర్ చేసుకుంది. అయితే.. ఇలా టాప్ లెస్ పోజులు ఇవ్వడంపై అమ్మడికి ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రతీవాళ్లూ ఇదే పాయింట్ ను అడుగుతుండడంతో అమ్మడికి చికాకు బాగా పెరిగిపోయింది. ఒక్కసారిగా రివర్స్ అయిపోయి.. పంచ్ డైలాగ్స్ పేల్చేసింది.

అయినా.. నేనేమన్నా టాప్ లెస్ గా కనిపించానా.. ఆ ఫోటోలైనా మీకేమైనా టాప్ లెస్ చూపించినట్లుగా ఉందా.. ఫోటోగ్రఫీ అనేది ఓ ఆర్ట్. అందంగం కనిపించే ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. నా కంటే ముందు అంతకంటే ఎక్కువగా ఎక్స్ పోజింగ్ చేసినవాళ్లు చాలామందే ఉన్నారు.

,  ,  ,  ,  ,