Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-May-2016 17:25:31
facebook Twitter Googleplus
Photo

అనుకున్నదే అయింది. రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే జూన్ 2కు ?అ..ఆ? రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కావడం విశేషం. అందుకే ఆ రోజు గురువారం అయినా సరే.. తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద ఏరియాలో సెలవు కలిసి వస్తుందన్న ఉద్దేశంతో రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. మామూలుగా సినిమాల్ని శుక్రవారమే రిలీజ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఎంతైనా నితిన్ తెలంగాణవాడు. అతడి సినిమాలకు ఈ ప్రాంతంలో ఆదరణ బాగుంటుంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద నగరమైన హైదరాబాద్ లో సెలవు ఉంటే కలెక్షన్లు అదిరిపోతాయి. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీ కూడా కలిసొస్తుందని జూన్ 2కు విడుదల ఖాయం చేశారు. ఆల్రెడీ జూన్ 1న యుఎస్ ప్రిమియర్స్ కన్ఫమ్ చేస్తూ యాడ్స్ కూడా ఇచ్చేశారు కాబట్టి ఇక రిలీజ్ డేట్ విషయంలో సందేహాలేమీ పెట్టుకోనక్కర్లేదు. త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్ లో మంచి ఆదరణ ఉంటుంది కాబట్టి.. ?అ..ఆ? లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీతో భారీ కలెక్షన్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

మే 6నే విడుదల కావాల్సిన ?అ..ఆ?ను తప్పనిసరి పరిస్థితుల్లో ఓ వారం వెనక్కి జరపాల్సి వచ్చింది. కానీ ఈ లోపు బ్రహ్మోత్సవం మే 20కి ఫిక్సవడంతో ?అ..ఆ?ను మళ్లీ వాయిదా వేయక తప్పలేదు. ?బ్రహ్మోత్సవం? విడుదల తర్వాత రెండు వారాల గ్యాప్ పెట్టుకుని జూన్ ఫస్ట్ వీక్ సినిమాను రిలీజ్ చేసేస్తున్నారు. టీజర్ దగ్గర్నుంచి ఫుల్ పాజిటివ్ బజ్ తో సాగుతున్న ?అ..ఆ? మీద అంచనాలు బాగానే ఉన్నాయి. మళ్లీ త్రివిక్రమ్ ముద్ర చూపిస్తుందని భావిస్తున్నఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

,  ,  ,  ,  ,