Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2016 10:37:44
facebook Twitter Googleplus
Photo

ఒకటీ అరా సినిమాలు చేసి ఆ తరువాత ఫేడవుట్ అయిపోయిన హీరో సుమంత్ మరోసారి రీమేక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన నరుడా డోనరుడా సినిమాతో మళ్లీ మీడియా ముందు కనిపిస్తున్న ఆయన రోజూ ఏదో ఒక చానల్ లో మాట్లాడుతున్నారు. ఆ సందర్భంగా అనేక ఆసక్తికర విశేషాలు చెబుతున్నారు. అందులో భాగంగానే ఆయన తాజాగా చెప్పిన సంగతులు చాలామందికి ఆశ్చర్యం కలిగించాయి. ముఖ్యంగా వైసీపీ అధినేత జగన్ తాను మంచి మిత్రులమని చెబుతూ తామిద్దరం క్లాసుమేట్లని కూడా చెప్పారు.

సుమంత్ తన స్కూల్ డేస్ లో చేసిన పనులను గుర్తు చేసకున్నారు. ఒకసారి జగన్ తో కలసి దొంగతనంగా తన బెడ్ రూంలోకి వెళ్లబోతూ తాతయ్య అక్కినేని నాగేశ్వరరావుకు అడ్డంగా దొరికిపోయామని ఆయన చెప్పారు. దాదాపు 25 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన గురించి చెబుతూ... తాను జగన్ ఒకే క్లాసులో ఒకే బెంచీలో కూర్చుని చదివామని కలసి అల్లరి చేశామని చెప్పుకొచ్చాడు.

ఓ రోజు రాత్రి పొద్దుపోయే వరకూ కలిసి తిరిగామని ఆపై జగన్ తన ఇంట్లోనే ఉండాల్సి వచ్చిందని చెబుతూ పైనున్న బెడ్ రూమ్ కు దొంగతనంగా వెళ్లేందుకు తాను మొదట గ్రిల్ పట్టుకుని ఎక్కుతుండగా తాతయ్య చూశారని చెప్పాడు. ఆ సమయంలో గ్రిల్ పట్టుకుని వేలాడుతూనే "తాతా... అతని పేరు జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ రాజశేఖరరెడ్డ గారి కొడుకు" అంటూ పరిచయం చేశానని చెప్పుకొచ్చాడు. ఆనాటి రోజుల్ని తాను జగన్ ఎంతో ఎంజాయ్ చేశామని వివరించారు.

,  ,  ,  ,  ,  ,