Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2016 11:59:00
facebook Twitter Googleplus
Photo

రెండు దశాబ్దాలకు పైగా హీరోగా కొనసాగిన జగపతిబాబు.. కొన్నేళ్ల కిందటే విలన్ అవతారం ఎత్తాడు. ఒక్కసారిగా ఆయన కెరీర్ మలుపు తిరిగింది. విలన్.. క్యారెక్టర్ రోల్స్ లో అదరగొట్టేస్తూ తీరిక లేకుండా ఉన్నారాయన. హీరోగా సంపాదించినదానికంటే ఎక్కువగానే ఇప్పుడు సంపాదిస్తున్నారు. ఐతే ఇప్పుడు మళ్లీ ఆయన హీరో అవతారం ఎత్తాలని ఆశ పడుతున్నారు. తెలుగులో ఆయన కథానాయకుడిగా త్వరలోనే ఓ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోందట. దానికి నిర్మాత ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. అది మరెవరో కాదు.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.

కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ కథానాయకుడిగా పరిచయమవుతున్న ?జాగ్వార్? సినిమాలో జగపతి విలన్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చేస్తున్న సమయంలో కుమారస్వామి తనకు ఆప్త మిత్రుడిలా మారిపోయాడని.. తాను హీరోగా తెలుగులో ఓ సినిమాను నిర్మించడానికి కూడా ముందుకొచ్చాడని జగపతి చెప్పాడు. త్వరలోనే ఈ సినిమా గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని జగపతి అన్నాడు. మరోవైపు కుమారస్వామి జగపతితో పాటు మరికొందరు తెలుగు హీరోలతో ఇక్కడ సినిమాలు తీస్తానంటున్నాడు. ఆ లిస్టులో పవన్ కళ్యాణ్ పేరు కూడా ఉందని ఆయన చెప్పడం విశేషం. పవన్ సినిమా సంగతేంటో కానీ.. ముందు జగపతితో ఆయన ఎలాంటి సినిమా తీస్తారో చూద్దాం.

,  ,  ,  ,  ,  ,