Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-May-2016 11:54:46
facebook Twitter Googleplus
Photo

రామ్ చరణ్ ఈ మధ్య బాగా స్లో అయిపోయాడు. స్లో అనడం కంటే.. అసలు యాక్టివిటీనే చూపించడం లేదని చెప్పాలి. ఇప్పటికి రామ్ చరణ్ మూవీ రిలీజ్ అయ్యి.. ఏడు నెలలు దాటిపోయింది. ఇప్పటివరకూ కనీసం కొత్త సినిమా షూటింగ్ లోనే పాల్గొనడం లేదంటే.. మనోడి యాక్టివిటీ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

ఒకవైపు చెర్రీకి పోటీ హీరోలంతా మహా యాక్టివిటీ చూపించేస్తున్నారు. బన్నీ అయితే సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిపోతున్నాడు. ఎన్టీఆర్ అయితే వరుసగా సినిమాలు చేసేస్తున్నాడు. ఇతర స్టార్స్ కూడా కంటిన్యూగా షూటింగ్స్ చేసేస్తున్నా.. చెర్రీ మాత్రం తన మూవీ ధృవ షూటింగ్ లో ఇప్పటివరకూ పాల్గొనలేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. మెగా ఫ్యామిలీ నుండి ఇతర హీరోలు చక్కగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుణ్ తేజ్ అండ్ సాయిధరమ్ లు కూడా మంచి హీరోలుగా ఎదుగుతున్నారు. కాని ఆల్రెడీ సూపర్ ఫామ్ లో ఉన్న చరణ్ మాత్రం.. సినిమా మొదలెట్టడానికీ లేటే.. దానితో హిట్టు కొట్టడానికీ లేటే అన్నట్లు చేస్తున్నాడు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తని ఒరువన్ రీమేక్ ని స్టార్ట్ చేసి మూడు నెలలు గడిచిపోయినా.. ఇప్పటివరకూ యూనిట్ తో హీరో జతవలేదు. నిజానికి మే నెల ప్రారంభంలోనే కశ్మీర్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కొన్ని పాటలతో పాటు ప్రధానమైన సీన్స్ తీయాలన్నది ఐడియా. అయితే.. చెర్రీ తను అందుబాటులో ఉండడని చెప్పడంతో.. మే 22కి వాయిదా వేశారు. ఇప్పుడు కూడా చరణ్ నుంచి సేమ్ ఆన్సర్ రావడంతో.. జూన్ 3నుంచి మూవీ షూటింగ్ స్టార్టవుతుంది అంటున్నారు. అప్పటికి కూడా అనుమానమే అని చెప్పాలి.

నిజానికి చెర్రీ నిర్మాతగా మెగాస్టార్ చేయబోతున్న కత్తిలాంటోడు షూటింగ్ మొదలయ్యేది జూన్ 6న. అలాంటప్పుడు జూన్ 3న రామ్ చరణ్ మూవీ స్టార్ట్ అవడం డౌట్ అనే చెప్పాలి. కాని ఇలా అయితే ఎలా చరణ్.. కాస్త సీరియస్ గా తీస్కోవాలి కదా అంటున్నారు అభిమానులు. మనోడు మాత్రం.. థని ఒరువన్ రీమేక్ కోసం వెజిటేరియన్ డైట్ తింటున్నా.. ఫిజిక్ మారుస్తున్నా.. అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.

,  ,  ,  ,  ,  ,