Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Jul-2017 10:34:35
facebook Twitter Googleplus
Photo

హీరోగా ఒకప్పుడు మంచి స్థాయిలో ఉన్న జగపతిబాబు.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో బాగా వెనుకబడిపోయారు. ఓ దశలో ఆయన సినిమాలు విడుదలయ్యే సంగతే జనాలు పట్టించుకోవడం మానేశారు. అలాంటి సమయంలో లెజెండ్ సినిమాతో విలన్ పాత్రలోకి మారడం ఆయన కెరీర్ ను మలుపు తిప్పింది. మరి ఇంతకీ లెజెండ్ లో జగపతి బాబుకు ఎలా అవకాశం దక్కింది. జగపతిని విలన్ గా చూపించాలనే ఆలోచన బోయపాటికి ఎలా వచ్చింది.. అతడి కళ్లల్లో జగపతి ఎలా పడ్డాడు అన్న ప్రశ్నలకు ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడాయన.

లెజెండ్ సినిమా చేయడానికి ముందు హీరోగా నా కెరీర్ చాలా ఇబ్బందికర పరిస్థితులకు వచ్చింది. ఐతే నా జీవితంలో ఏదో ఒక మార్పు వస్తుందనే అనుకున్నా. కానీ నా శ్రేయోభిలాషులకు ఆ మాట చెబితే వాళ్లు నమ్మే పరిస్థితి లేదు. హీరోగా నా కెరీర్ ముగింపు దశకు వచ్చేసిందని అనిపించింది. అలాంటి సమయంలో నేను సరదాగా ఒక ఫొటో షూట్ చేశాను. నా తెల్లటి గడ్డాన్ని అలాగే ఉంచేసి ఫొటో షూట్లో పాల్గొన్నాను. మేకప్ ఆర్టిస్ట్ గడ్డానికి రంగు వేద్దామన్నాడు. కానీ నేను ఒప్పుకోలేదు. తెల్లటి గడ్డంతోనే ఫొటో షూట్ చేశాను. ఆ ఫొటో షూట్ బయటికి వచ్చింది. బోయపాటి అది చూశాడు. కానీ నేను ఫొటో షూట్ చేసిన సమయానికి.. లెజెండ్ చేయడానికి మధ్య మూడేళ్లు గ్యాప్ ఉంది. బోయపాటి ఎప్పుడో ఒకసారి నా ఫొటోలు చూశాడు. కానీ చాలా గ్యాప్ తర్వాత నాతో మాట్లాడాడు. ఆ ఫొటో షూట్ ఆయన మైండ్లో ఉండిపోయింది. దాని నుంచే లెజెండ్ విలన్ పాత్ర పుట్టుకొచ్చింది. ఆ పాత్రకు నన్ను అడగ్గానే ఒప్పుకున్నా.

,  ,  ,  ,  ,