Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Jun-2016 11:54:55
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్లో స్టార్ హీరోల పేర్ల వెనుక ?బాబు? జోడించి పిలవడం అన్నది ఒకప్పుడు ఒక ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడొస్తున్న హీరోల విషయంలో ఈ పద్ధతి పోయింది కానీ.. ఒకప్పుడు మాత్రం ?బాబు? కచ్చితంగా ఉండాల్సిందే అన్నట్లుండేది. కొందరు హీరోలకు పేరులోనే ?బాబు? ఉంటే.. ఇంకొందరికి ఇండస్ట్రీ ?బాబు?ను తగిలించేసింది. దీనిపై ?ఖడ్గం? సినిమాలో కృష్ణవంశీ సెటైర్లు వేసినా.. దాన్ని ఇండస్ట్రీ జనాలు పెద్దగా పట్టించుకుంది లేదు. ఇంతకీ ఇప్పుడీ చర్చ ఎందుకయ్యా అంటే.. ?లెజెండ్? సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ?బాబు? అనే మాట విషయంలో ఇబ్బందికర పరిస్థితి ఎదురైందట జగపతిబాబుకి. ఆ ఇబ్బందేంటో అతడి మాటల్లోనే తెలుసుకుందాం పదండి.

??నన్ను ముందు నుంచి ఇండస్ట్రీలో బాబు అని పిలిచేవారు. ఐతే ?లెజెండ్? సినిమాతో బాలయ్య బాబుతో నటించడంతో సెట్లో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. బాలయ్యను.. నన్ను ఇద్దరినీ ?బాబూ? అని పిలుస్తుండటంతో కన్ఫ్యూజన్ ఎదురైంది. అందుకే నన్ను ?జగపతి? అని మాత్రమే పిలవాలని.. బాలయ్యను మాత్రమే ?బాబు? అనమని చెప్పాను. కానీ మిగతా వాళ్లు ఆపేసినా బాలయ్య మాత్రం నన్ను బాబూ అనే పిలవసాగారు. దీంతో యూనిట్లో వాళ్లందరూ కూడా ఆయనే మిమ్మల్ని బాబూ అని పిలుస్తుంటే మేమెందుకు అనకూడదు సార్ అన్నారు. అదీ బాలయ్య మంచితనం. ఆ సినిమా షూటింగ్ సందర్భంగా బాలయ్య నన్ను ఎంత బాగా చూసుకున్నాడో మాటల్లో చెప్పలేను. ?బాబును బాగా చూసుకోండి. ఆయన గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. ఆయనకు ఏ ఇబ్బందీ రాకూడదు? అని అందరితో బాలయ్య అనేవాడు. షూటింగ్ సందర్భంగా నన్ను ఓ ఇష్యూ ఇబ్బంది పెట్టింది. దాన్ని నాకు తెలియకుండానే ఆయనే పరిష్కరించేశాడు. ఈ సంగతి నాకెందుకు చెప్పలేదంటే నవ్వి ఊరుకున్నాడు?? అని లెజెండ్ రోజుల్ని గుర్తుచేసుకున్నాడు జగపతి.

,  ,  ,  ,  ,