Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

31-Jan-2017 10:49:28
facebook Twitter Googleplus
Photo

గత కొన్నేళ్లలో టాలీవుడ్లో చూసిన బెస్ట్ విలన్ క్యారెక్టర్లలో నాన్నకు ప్రేమతో లో జగపతి బాబు పోషించిన కృష్ణమూర్తి పాత్ర కచ్చితంగా ఉంటుంది. విలన్ అంటే భయం గొలిపే అవతారంలో కనిపిస్తూ.. రౌడీల్ని వెంటేసుకుని తిరుగుతూ.. హీరోతో ఫైట్లు చేసేవాడే కావాల్సిన అవసరం లేదని.. స్టైలిష్ గా.. సాఫ్ట్ గా కనిపిస్తూనే క్రూరత్వాన్ని చూపించవచ్చని రుజువు చేసిన పాత్రల్లో ఇదొకటి. సుకుమార్ ఈ పాత్రను ఎంత బాగా తీర్చిదిద్దాడో.. జగపతి అంత బాగా దాన్ని పండించాడు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమా సోమవారమే మొదలైంది. రామ్ చరణ్ హీరోగా సుకుమార్ మొదలుపెట్టిన కొత్త సినిమాలోనూ జగపతి ఓ కీలక పాత్ర చేస్తున్నాడు.

జగపతి బాబు చేయబోయేది నాన్నకు ప్రేమతో తరహాలో విలన్ పాత్రా లేక మరో రకమా అన్నది తెలియాల్సి ఉంది. పాత్ర ఎలాంటిదైనా సుకుమార్ స్టయిల్లో ప్రత్యేకంగా ఉంంటూ ఆసక్తి రేకెత్తిస్తుందనడంలో సందేహం లేదు. బాలకృష్ణతో మొదలుపెట్టి మహేష్ బాబు.. ఎన్టీఆర్ లాంటి స్టార్ల సినిమాల్లో కీలక పాత్రలు చేసిన జగపతి.. రామ్ చరణ్ తో తొలిసారి నటించబోతున్నాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ కూడా ఆసక్తి రేకెత్తించేదే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తాడు. అతడి ఫేవరెట్ కెమెరామన్ రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా సమంత నటించనుంది.

,  ,  ,  ,  ,  ,  ,