Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

04-Jul-2017 11:27:01
facebook Twitter Googleplus
Photo

రూ.60-70 కోట్లు సమకూర్చుకుంటే తప్ప వర్కవుట్ కాదు. తీరా సినిమా చేసి అది హిట్టయినా లాభాలు మరీ గొప్పగా ఏమీ ఉండట్లేదు. అందుకే పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీసి రిస్క్ చేయడం కంటే మీడియం రేంజి హీరోలతో మీడియం బడ్జెట్లో సినిమా చేసి ఓ మోస్తరు లాభాలు చేసుకోవడమే మంచిదని భావిస్తున్నారు. నాని.. శర్వానంద్.. నిఖిల్ లాంటి యంగ్ హీరోలు నిర్మాతల కళ్లకు బాగా ఆనుతున్నారు. వీళ్లతో సినిమాలంటే రిస్క్ తక్కువ. మినిమం గ్యారెంటీ అన్న భరోసా ఉంది. సినిమా ఆడితే మంచి లాభాలొస్తున్నాయి.

నిఖిల్ నుంచి గత ఏడాది వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా పెట్టుబడి మీద మూడు రెట్లు వసూలు చేసింది. ఈ మధ్య కేశవ లాంటి ఏవరేజ్ సినిమాతోనూ నిర్మాతకు మంచి లాభాలు వచ్చాయి. అది కూడా పెట్టుబడి మీద రెట్టింపు షేర్ రాబట్టింది. అందుకే చాలామంది నిర్మాతలు నిఖిల్ వెంటపడుతున్నారిప్పుడు. నిఖిల్ తమిళం లో హిట్టయిన కనిదన్ రీమేక్ కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. దీని ఒరిజినల్ నిర్మాత కలైపులి థానునే తెలుగులో చేద్దామనుకుంటున్నారు. ఐతే రీమేక్ హక్కులు తీసుకుని ఈ చిత్రాన్ని తామే నిర్మిద్దామని చాలామంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం నిఖిల్ కు క్రేజీ రెమ్యూనరేషన్ ఆఫర్లు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రూ.2.25 కోట్ల డబ్బుతో పాటు లగ్జరీ వోల్వో కారు కూడా ఆఫర్ చేస్తున్నారట. ఐతే నిఖిల్ ఏ విషయం తేల్చట్లేదు. ఎవరికి ఓకే చెప్పాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఐతే అతను కనిదన్ రీమేక్ లో నటించడం మాత్రం పక్కా అంటున్నారు.

,  ,  ,  ,  ,