Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Sep-2016 13:14:30
facebook Twitter Googleplus
Photo

మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో దర్శకుడు మహాదేవ్ తెరకెక్కిస్తున్న చిత్రం జాగ్వర్. సుమారు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుకను ఈ నెల 18న హైద్రాబాద్‌లోని నోవాటెల్‌లో వైభవంగా నిర్వహించనున్నారు. అలాగే ఈ నెల 22న చిత్రాన్ని సెన్సార్ కార్యక్రమాలకు పంపనున్నారు.
ఆ వెంటనే మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసి సినిమాని అక్టోబర్ 6న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో చాలా ఇనిమాల్లాగే ఈ ఇది కూడా దసరా రేస్ లో నిలబడినట్లైంది. ఇకపోతే ఈ ఆడియో కార్యక్రమానికి ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ లు హారుకానున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి ప్రముఖ కథకుడు, ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి అయినా విజయేంద్ర ప్రసాద్ కథను అందించడం విశేషం.

,  ,  ,  ,  ,  ,