Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

28-Nov-2016 12:29:21
facebook Twitter Googleplus
Photo

మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న మూవీ.. ఇప్పుడు కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. మహేష్ అండ్ టీం ప్రస్తుతం గుజరాత్ లో కొలువుదీరారు. అహ్మదాబాద్ లోని రోడ్లపై మహేష్ బాబు తెగ ఫైటింగ్స్ చేసేస్తున్నాడు.

మూడో షెడ్యూల్ కోసం మేము అహ్మదాబాద్ ను ఎంచుకోవడానికి కారణం.. ఇక్కడి ప్లెజెంట్ వాతావరణం. హైద్రాబాద్ లో షూటింగ్ చేస్తే.. అభిమానులు గుమిగూడిపోతారు. షూటింగ్ సజావుగా సాగదు. కానీ ఇక్కడి ఆడియన్స్ కు సౌత్ స్టార్లు అంతగా తెలీదు. అందుకే ఇక్కడే షూటింగ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడి ప్రజలు-పోలీసులు షూటింగ్స్ కు సహకరించడం అన్నిటికంటే ముఖ్యమైన కారణం' అంటున్నాడు నిర్మాత ఠాగూర్ మధు. మరో 25 రోజులపాటు.. అంటే డిసెంబర్ 23వరకూ గుజరాత్ లోనే షూటింగ్ జరగనుండగా.. ప్రధానంగా యాక్షన్ సన్నివేశాలనే ఇక్కడ చిత్రీకరించబోతున్నారు.

ధర్మజ్ - గాంధీనగర్.. రివర్ ఫ్రంట్లలో కూడా షూటింగ్ చేయనున్నాడట మురుగదాస్. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే.. ఫ్యామిలీతో కలిసి పది రోజుల పాటు యూకే టూర్ వెళ్లనున్నాడు మహేష్.

,  ,  ,  ,  ,  ,