Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

08-Jun-2017 12:05:50
facebook Twitter Googleplus
Photo

నందమూరి బాలకృష్ణ హీరోగా పూరీ జగన్నాధ్ సినిమా అనగానే ఓ కొత్త క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లయింది. ఈ సెన్సేషనల్ కాంబోలో రూపొందుతున్న బాలయ్య 101వ చిత్రానికి.. ఇప్పుడు ఫస్ట్ లుక్ ఇచ్చేందుకు యూనిట్ రెడీ అవుతోంది. ఈ నెల 10న బాలకృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకుని.. ఓ రోజు ముందుగానే ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ ను కూడా రివీల్ చేసి అభిమానులకు.. బహుమతి ఇవ్వనున్నారు బాలకృష్ణ.

NBK101 కోసం భవ్య క్రియేషన్స్ పలు టైటిల్స్ ను రిజిస్టర్ చేయించింది. తేడా సింగ్.. ఉస్తాద్ లతో పాటు జై బాలయ్య కూడా వీటిలో ఒకటి. ఇప్పుడు ఫైనల్ గా జై బాలయ్య టైటిల్ కే ఫిక్స్ అయ్యారట యూనిట్. ఈ మేరకు ఫస్ట్ లుక్ పోస్టర్స్ సిద్ధమవు తున్నాయని తెలుస్తోంది. ఈ టైటిల్ వినగానే ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తారు. బాలయ్య కెరీర్ బెస్ట్ గా జై బాలయ్య నిలవాలని కోరుకుంటారు. కానీ కామన్ ఆడియన్స్ పరిస్థితేంటనే విషయమే కాసింత ఆలోచించాలి.

బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా నటించే ఈ మూవీలో.. పూరీ మార్క్ పంచ్ లతో జై బాలయ్య అని అరిపించే మూమెంట్స్ చాలానే ఉండొచ్చు. అలాగని డైరెక్టుగా జై బాలయ్య అనే టైటిల్ అంటే మాత్రం.. కామన్ ఆడియన్స్ కు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. ఫ్యాన్స్ కు మాత్రమే ఈ సినిమా అని ఇన్ డైరెక్టుగా చెప్పినట్లు అవుతుందనే టాక్ వినిపిస్తోంది.

,  ,  ,  ,  ,