Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Jun-2017 10:15:58
facebook Twitter Googleplus
Photo

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న జై లవ కుశ చిత్రం షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీని.. దర్శకుడు బాబీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. యంగ్ టైగర్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచిపోయేలా జాగ్రత్త పడుతున్నాడు బాబీ.

జై లవ కుశ టైటిల్ పై రూపొందుతున్న ఈ మూవీలో.. ఇప్పుడు విలన్ ను ఫైనలైజ్ చేశారు. ఉదాన్.. అగ్లీ వంటి చిత్రాల్లో నటించిన బాలీవుడ్ నటుడు రోనిత్ రాయ్ ను విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోనిత్ రాయ్ షూటింగ్ కూడా ప్రారంభించేయగా.. హైద్రాబాద్ పరిసరాల్లోని ఓ క్వారీలో ప్రస్తుతం భారీ యాక్షన్ సీక్వెన్స్ రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్- రోనిత్ రాయ్ ల మధ్య హై ఓల్టేజ్ ఫైటింగ్ జరుగుతోందట. మొదట ఈ పాత్ర కోసం కన్నడ నటుడు దునియా విజయ్ ను తీసుకోవాలని భావించారు. అయితే.. ఈ పాత్రకు రోనిత్ అయితే కరెక్ట్ గా సరిపోతాడనే ఉద్దేశ్యంతో.. చివరి నిమిషంలో ఇతడిని తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ తో పాటు ఇతని పాత్రకు కూడా ప్రోస్థటిక్ మేకప్ ఉంటుందని.. విభిన్నమైన గెటప్ లో కనిపించనున్నాడని అంటున్నారు.

,  ,  ,  ,  ,