Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

13-Mar-2017 10:40:37
facebook Twitter Googleplus
Photo

గోపీచంద్ కెరీర్ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. వరుస ఫ్లాపుల తర్వాత లేక లేక ‘లౌక్యం’ రూపంలో ఒక హిట్టు కొడితే.. దాన్ని ఆ తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. సౌఖ్యం అట్టర్ ఫ్లాప్ కాగా.. దానికి ముందు తర్వాత చేసిన సినిమాలు విడుదలకే నోచుకోకుండా ఆగిపోయాయి. గోపాల్ డైరెక్షన్లో నయనతార హీరోయిన్ గా గోపీ ఒక సినిమాను పూర్తి చేసి చాలా కాలమైంది కానీ.. అది విడుదలకు నోచుకోలేదు. దీనికి తోడు ఎ.ఎం.రత్నం నిర్మాణంలో ఆయన తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో మొదలుపెట్టిన ఆక్సిజన్ కు కూడా బ్రేక్ పడింది. ఈ రెండు సినిమాల సంగతేంటో తేల్చకుండా సంపత్ నంది దర్శకత్వంలో గౌతమ్ నంద లోకి షిఫ్టయిపోయాడు గోపీ.

గోపాల్ సినిమాతో పాటు ‘ఆక్సిజన్’ కూడా విడుదలకు రెడీ అయిపోయినప్పటికీ వాటిని గోపీచందే ఉద్దేశపూర్వకంగా ఆపుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు సినిమాలపై గోపీకి ఏమంత ఆశలున్నట్లుగా లేవు. ఈ సినిమాలకు సంబంధించిన చాలా నెగెటివ్ న్యూస్ లు బయటికి వచ్చిన నేపథ్యంలో ట్రేడ్ వర్గాల్లో కూడా అంత క్రేజ్ లేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు రిలీజైతే వాటి ఎఫెక్ట్ ‘గౌతమ్ నంద’ మీద పడుతుందని గోపీ భయపడుతున్నాడు. ‘గౌతమ్ నంద’ మీద గోపీకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ కూడా ఉంది. అందుకే ఆ చిత్రాన్ని ముందు రిలీజ్ చేసేసి.. ఆ తర్వాత పాత సినిమాలు రెంటినీ ప్రేక్షకుల ముందుకు తేవాలనుకుంటున్నాడు.

,  ,  ,  ,  ,