Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

02-Sep-2017 10:47:44
facebook Twitter Googleplus
Photo

వారసుల్లో ప్రస్తుతం తెలివుడ్ ని తనదైన శైలిలో ఏలుతున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో - జనతా గ్యారేజ్ లాంటి బాక్స్ ఆఫీస్ హిట్స్ ను అందుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు ఆ హిట్ చిత్రాలకు బిన్నంగా జై లవకుశ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్స్ తో పోస్టర్ లుక్ తో ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్ రీసెంట్ గా మూడు పాత్రల లుక్స్ ఉన్న ఒక ఫోటోని సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశాడు.

పోస్టర్ ని చూస్తుంటే ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా కనిపిస్తున్నట్లు క్లియ్యర్ గా అర్ధమవుతోంది. ఎన్టీఆర్ కోపంతో పాటు చిరునవ్వు మరియు స్టైలిష్ లుక్స్ ఆ పోస్టర్ లో ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే.. సినిమాలో జై పాత్ర యాక్షన్ సీన్స్ తో ఇరగదీస్తే లవ పాత్ర కామెడీతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఎన్టీఆర్ నుంచి ఆశించే అసలైన డాన్సులతో కుశ పాత్ర విజిల్స్ వేయించడం గ్యారంటీ అని చెప్పవచ్చు. ఎన్నో సినిమాల్లో నటుడిగా తానేంటో నిరూపించుకున్న ఎన్టీఆర్ ఒక్కో సినిమాలో ఒక్క తరహా పాత్ర చేసి ఆకట్టుకున్నాడు. కానీ జైలవకుశ సినిమాలో ఒకే స్క్రీన్ పై ఒకే సిన్ లో మూడు విభిన్న పాత్రలశైలితో కనిపిస్తున్నాడు అంటే తెలుగు ప్రేక్షకులు ఫిదా అవ్వాల్సిందే.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఈ సినిమాతో ఎన్టీఆర్ నటనలో సూపర్బ్ అనిపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటివరకు ఈ సినిమా పాజిటివ్ టాక్ ని బాగానే తెచ్చుకుంది ఉంది. ఇక ఈ సినిమాను బలుపు -సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలను తెరకెక్కించిన కె.ఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నన్నాడు.

,  ,  ,  ,