Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Nov-2016 10:28:48
facebook Twitter Googleplus
Photo

టాలీవుడ్ లో అనతి కాలంలో పెద్ద పెద్ద స్టార్లతో సినిమాలు చేసేసి.. అంతకంటే స్పీడ్ గా సైడ్ అయిపోయిన డైరెక్టర్ మెహర్ రమేష్. అంతకు ముందు కూడా ఫ్లాప్స్ మాత్రమే ఉన్నా.. ఎన్టీఆర్ తో శక్తి.. వెంకటేష్ తో షాడో మూవీస్ తర్వాత.. ఈ దర్శకుడికి ఆఫర్ ఇచ్చేందుకు ఏ నిర్మాత.. ఏ హీరో సాహసించలేదు.

అయితే.. మెహర్ రమేష్ కి స్టార్ హీరోలతో మంచి పరిచయాలే ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ కూడా మెహర్ ఫ్రెండ్స్ లిస్ట్ లో ఉన్నాడు. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య ర్యాపో బాగా పెరిగింది. మహేష్ తో మెహర్ రమేష్ ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ కోసం యాడ్ తీసి మెప్పించి. తన స్టైలిష్ మేకింగ్ ట్యాలెంట్ చూపించాడు. ఆ తర్వాత నుంచి మహేష్ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిన ఈ దర్శకుడు.. ఫ్యామిలీ వెకేషన్స్ కి కూడా కలిసి వెళ్లిపోతున్నాడు. రీసెంట్ గా ముంబైలో మహేష్ ఫ్యామిలీతో కలిసి కనిపించాడు. ఆ హీరో పిల్లలతో తరచుగా ఆడుకుంటూ కూడా కనిపిస్తుండడం విశేషం.

ఇంతగా ఓ స్టార్ హీరో వెనక.. దర్శకుడు కనిపించడం అరుదుగా కనిపించే విషయం. తనకు ఓ ఛాన్స్ ఇవ్వమంటూ.. మెల్లగా మహేష్ ని ప్రిపేర్ చేసే ప్రయత్నమే ఇదంతా అనుకుంటున్నారు ఫిలిం నగర్ జనాలు. కేవలం క్లోజ్ గా ఉన్నంత మాత్రాన.. ఫ్రెండ్ షిప్ కే మహేష్ బాబు ఛాన్స్ ఇచ్చేస్తాడా అన్నది అసలు పాయింట్. ఒకవేళ మెహర్ రమేష్ ఉద్దేశ్యం అదే అయితే మాత్రం.. ప్రస్తుతం సూపర్ స్టార్ లైన్ లో పెట్టిన సినిమాల లిస్ట్ చూస్తే.. మెహర్ కి ఛాన్స్ ఇవ్వడం అసాధ్యమే అనే టాక్ ఉంది.

,  ,  ,  ,  ,