Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Sep-2017 13:03:47
facebook Twitter Googleplus
Photo

జై లవకుశ మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గురువారం రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. అక్కడక్కడా కొంచెం మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నా కలెక్షన్స్ లో ఏ మాత్రం అలసటని చూపెట్టడం లేదు. భారీ అంచనాలతో తెరకెక్కిన జై లవకుశ సినిమా ఎన్టీఆర్ కెరీర్ కి మంచి బూస్ట్ ని ఇస్తోందనే చెప్పాలి.

ఇక కొన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. రెండవ రోజు మొత్తం షేర్స్ రూపంలో 37.5 కోట్లను అందుకున్న తారక్.. మొత్తం గ్రాస్ 61 కోట్లను కొల్లగొట్టాడు. ఈ స్థాయిలో రికార్డు కలెక్షన్స్ రావడం ఎన్టీఆర్ సినిమాకు ఇది మొదటి సారి. ఇంతకుముందు జనతా గ్యారేజ్ సెట్ చేసిన బాక్స్ ఆఫీస్ మార్క్ ను జై లవకుశ ఇంకా దాటేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో ఆ మార్క్ ను దాటేసింది. ఓవర్సీస్ ప్రీమియర్ షోల్లో కూడా తారక్ హాఫ్ మిళియన్ డాలర్లను అందుకున్నాడు.

మొత్తానికి జై లవకుశ ప్రస్తుతానికి సేఫ్ జోన్ లోనే ఉన్నాడు. ఇదే స్థాయిలో ఇంకా ముందుకు వెళితే తారక్ 100 కోట్లను క్రాస్ చేయడం పెద్ద కష్టమేమి కాదు. సెలవులు కూడా ఉన్నాయి. ఇక శని ఆదివారాల్లో ఎక్కువ స్థాయిలో కలెక్షన్స్ జ్వచ్చే అవకాశం ఉంది. స్పైడర్ వచ్చే లోపు రావాల్సిన కలెక్షన్స్ వస్తే చాలు. ఆ తర్వాత స్పైడర్ పోటీని ఇచ్చినా దసరా సెలవులు కావడంతో కొంత ఊపందుకునే ఛాన్స్ ఉంది.

,  ,  ,  ,  ,  ,