Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Sep-2017 11:38:32
facebook Twitter Googleplus
Photo

ఎన్టీఆర్ స్టామినా ఎలా ఉంటుందో గత ఏడాది అందరికీ అర్థమైంది. జనతా గ్యారేజ్ లాంటి డివైడ్ టాక్ తెచ్చుకున్న సినిమా కూడా టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలవడాన్ని బట్టి గత కొన్నేళ్లలో ఎన్టీఆర్ రేంజ్ ఎలా పెరిగిందన్నది అందరికీ అర్థమైంది. ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త సినిమా జై లవకుశ కు ఎంత హైప్ వచ్చిందో.. ఆ సినిమాకు ఏ రేంజిలో బిజినెస్ జరిగిందో తెలిసిందే. కేవలం థియేట్రికల్ హక్కులు మాత్రమే రూ.85 కోట్లకు అమ్ముడవడం విశేషం. మొత్తం బిజినెస్ రూ.110 కోట్లు దాటింది. ఈ సినిమా ఓపెనింగ్స్ విషయంలోనూ కళ్లు చెదిరే నంబర్స్ చూడబోతున్నామని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు మొదలవుతుండగానే జై లవకుశ వచ్చేస్తోంది. గురువారమే రిలీజవుతుండటం వల్ల లాంగ్ వీకెండ్ అడ్వాంలేజీ ఉంది. దీనికి తోడు తెలంగాణలో ఐదు షోల సౌలభ్యాన్ని ఉపయోగించుకోబోతున్న తొలి సినిమా జై లవకుశ నే అంటున్నారు. ఈ సినిమాకు ఉన్న హైప్ కు ఈ అడ్వాంటేజీలు కూడా తోడైతే.. ఓపెనింగ్స్ అనూహ్యంగా ఉంటాయని భావిస్తున్నారు. తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల గ్రాస్ జై లవకుశ టార్గెట్ అని అంటున్నారు. మామూలుగా వీకెండ్లో వంద కోట్ల గ్రాస్ అనగానే బాలీవుడ్ సినిమాలే గుర్తుకొస్తాయి. ఈ మధ్య సౌత్ సినిమాల రేంజ్ కూడా పెరిగి.. అవి కూడా ఆ మార్కుపై కన్నేస్తున్నాయి. జై లవకుశ కు ఉన్న హైప్.. అడ్వాంటేజెస్ చూస్తే ఈ మైల్ స్టోన్ పెద్ద కష్టమేమీ కాదనిపిస్తోంది.

,  ,  ,  ,