Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

06-Sep-2016 12:22:31
facebook Twitter Googleplus
Photo

ఈ ఏడాది సమ్మర్లో భారీ అంచనాలతో వచ్చిన ?సరైనోడు? సినిమాకు తొలి రోజు డివైడ్ టాక్ వచ్చింది. రొటీన్ సినిమా అంటూ క్రిటిక్స్ ఈ సినిమాను విమర్శించారు. చాలా లొసుగులు ఎత్తి చూపించారు. కానీ జనాలకు అదేమీ పట్టలేదు. సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. వీకెండ్ తర్వాత కూడా సినిమా నిలబడింది. ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. దీంతో క్రిటిక్స్ మీద విమర్శలు వచ్చాయి. విమర్శకులు జనాల నాడిని పట్టుకోలేరని.. వాళ్లకు సామాన్య ప్రేక్షకులకు అంతరం చాలా ఉంటుందని కామెంట్లు వినిపించాయి.

ఆ తర్వాత ఇప్పుడు మరోసారి ?జనతా గ్యారేజ్? విషయంలోనూ ఇలాంటి చర్చే నడుస్తోంది. ఈ సినిమా విషయంలో తొలి రోజు డివైడ్ టాకే వచ్చింది. రివ్యూలు ఏవరేజ్ గానే వచ్చాయి. కానీ వసూళ్లు మాత్రం దాంతో సంబంధం లేకుండా ఉన్నాయి. వీకెండ్లోనే ముప్పావు శాతం పెట్టుబడి రికవరీ అయిపోయినట్లు కనిపిస్తోంది. దీంతో మరోసారి విమర్శకులపై దాడి మొదలైంది. ?జనతా గ్యారేజ్? రిజల్ట్ విమర్శకులకు చెంపపెట్టు అన్న కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

ఐతే క్రిటిక్స్ అన్నవాళ్లు సినిమా మీద అభిప్రాయం చెబుతారు తప్ప.. ఇది ఆడొచ్చు ఆడకపోవచ్చు అనేదేమీ చెప్పరు. ఒక సినిమాలో ఏం బాగుంది.. ఏం బాగలేదు అని చెప్పడం విమర్శకుల బాధ్యత. కథా కథనాల గురించి విశ్లేషించడం.. లోటుపాట్లను ఎత్తి చూపడం.. బాగున్నవాటి గురించి ప్రశంసించడం అన్నది ఏ సినిమాకైనా జరిగేదే. ?జనతా గ్యారేజ్? విషయంలోనూ విమర్శకులు చేసిందదే. అందులో కొన్ని మంచి విషయాలున్నాయి. వాటి గురించి అందరూ పాజిటివ్ గానే మాట్లాడారు. అలాగే కొన్ని ముఖ్యమైన లోపాలూ ఉన్నాయి. వాటినీ ఎత్తి చూపారు. దీనికి వసూళ్లకు సంబంధం లేదు.

ఇక జనాలు ఎంత వరకు శాటస్ఫై అయ్యారు.. సినిమాను ఎలా భావించారు.. ఎలా ఆదరిస్తారు అన్నది వాళ్లకు సంబంధించిన విషయం. ప్రేక్షకులు ఓ సినిమాకు ఎలాంటి ఫలితాన్నిస్తారన్నది ఎవ్వరూ అంచనా వేయలేరు. ఇక ?గ్యారేజ్? వసూళ్ల విషయానికి వస్తే అలా రావడానికి కారణాలేంటన్నదీ అందరికీ తెలుసు. ఈ సినిమాకు ముందు ఎలాంటి హైప్ ఉంది.. ఎలాంటి టైమింగ్ లో రిలీజైంది.. అన్నది చూసుకుంటే వసూళ్లకు కారణమేంటన్నదీ స్పష్టమవుతుంది. మరి ఈ కోణంలో ఆలోచిస్తే.. విమర్శకుల మీద దాడి అన్నది ఎంత వరకు సమంజసమో అర్థమవుతుుంది.

,  ,  ,  ,  ,