Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2016 14:50:25
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జనతా గ్యారెజ్ నిన్నటితో షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. సెప్టెంబ 2న విడుదల కానున్న ఈ సినిమా విడుదలకు ఇంకా పదిరోజులే సమయం ఉండడంతో టీమ్, పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. శ్రీమంతుడు సినిమాతో ప్రచార కార్యక్రమాల్లో కొత్త పుంథలు తొక్కిన మైత్రీ మూవీ మేకర్స్ టీమ్, తమ రెండో సినిమాకూ అదే స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్లాన్ చేస్తోందట.
ఎన్టీఆర్ సైతం స్వయంగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అభిమానులను ఆహ్వానిస్తూ కొన్ని కాంటెస్ట్‌లు కూడా నిర్వహించాలని టీమ్ సన్నాహాలు చేస్తోంది. మిర్చి శ్రీమంతుడు సినిమాలతో దర్శకుడిగా తనదైన బ్రాండ్ సృష్టించుకున్న కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహించారు.

,  ,  ,  ,  ,  ,