Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

16-Nov-2017 13:39:21
facebook Twitter Googleplus
Photo

నీహారికకు.. ఇక్కడ అంతగా కలిసి రాలేదు. ఒక మనసు చిత్రం చక్కని దృశ్యకావ్యంలా నిలిచిందనే టాక్ వచ్చినా.. స్టోరీ నెరేషన్ మరీ సాగతీతలా ఉండడంతో.. జనాలు మెచ్చలేదు. రెండో సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేసిన నీహారిక.. కోలీవుడ్ నుంచి ఓ మంచి ఆఫర్ రావడంతో అటు వైపు అడుగులు వేసేసింది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరుపుకుంది కూడా.

'ఒరు నల్ల నాల్ పాతు సొల్రేన్' అనే టైటిల్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో.. స్టార్ హీరో విజయ్ సేతుపతితో పాటు.. కుర్ర హీరో గౌతమ్ కార్తీక్ కూడా నటిస్తున్నారు. ఈ ఆర్ముగ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై కోలీవుడ్ లో మంచి ఆసక్తి కనపడుతోంది. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి.. నీహారిక లుక్ బయటకు వచ్చింది. సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తున్న నీహారిక స్టిల్ ఒక్కసారిగా షాక్ కొట్టించేసింది. ఒంటి నిండా ఆభరణాలు.. ధరించిన దుస్తులు అన్నీ పూర్తి స్థాయి రీగల్ లుక్ లోనే ఉన్నాయి.

ఇప్పటివరకూ ఈ సినిమా కంటెంట్ గురించి లీక్ కాకపోయినా.. నీహారిక లుక్ ను చూస్తే మాత్రం.. ఈ చిత్ర కథపై ఊహాగానాలు మొదలైపోయాయి. మరోవైపు.. కోలీవుడ్ అరంగేట్రంలోనే నీహారిక పై అంచనాలను పెంచేందుకు ఈ సాంప్రదాయ లుక్ బాగా ఉపయోగపడుతోంది.

,  ,  ,  ,  ,  ,