Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

26-Apr-2017 10:31:26
facebook Twitter Googleplus
Photo

కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం మూవీపై రకరకాల న్యూస్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ గురించి అప్ డేట్స్ కూడా ఆగిపోవడంతో ఇక మూవీని పక్కన పెట్టేశారని.. రిలీజ్ ఆగిపోయినట్లేనని ఈ మధ్య ఓ టాక్ నడించింది. దీనిపై ఇప్పుడు నక్షత్రం టీం రియాక్ట్ అయింది.

కృష్ణవంశీ రూపొందిస్తున్న ఈ మూవీ ఆగిపోయే సమస్యే లేదని చెప్పిన యూనిట్.. ఇప్పటికే షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయినట్లు తెలిపింది. కేవలం ఒక పాట పిక్చరైజ్ చేస్తే సినిమా పూర్తయినట్లే అంటున్నారు. ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ ను నటింపచేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు జరుపుతుండగా.. హీరోయిన్ ను నిర్మాతలు ఫైనలైజ్ చేయగానే.. పాట చిత్రీకరణ చేయనున్నారు. వీలైనంత త్వరగా ఈ పాటను కూడా పూర్తి చేసేసి సినిమాను మే నెల చివరిలోగా విడుదల చేయాలని చూస్తున్నారు.

కొత్తగా తెరకెక్కించే పాటలో స్టార్ హీరోయిన్ తో మెగా హీరో సాయి ధరం తేజ్ డ్యాన్స్ చేయనున్నాడు.

,  ,  ,  ,  ,