Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 12:05:56
facebook Twitter Googleplus
Photo

హైదరాబాద్: టాలీవుడ్ హీరోల్లో స్టార్ హీరో హోదాతో దూసుకెలుతున్న జూ ఎన్టీఆర్.....సినిమా మార్కెట్ పరంగా నిన్ని మొన్నటి వరకు చాలా తక్కువే స్థాయే!.... ఇంతకు ముందు వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమా వరకు ఎన్టీఆర్ సినిమాలేవీ రూ. 50 కోట్ల మార్కును అందుకోలేదు. 'నాన్నకు ప్రేమతో' సినిమా మాత్రమే రూ. 50 కోట్ల మార్కును టచ్ చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో 'జనతా గ్యారేజ్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు నెలల ముందుగానే ప్రీ-రిలీజ్ బిజినెస్ మొదలైంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ సినిమాకు హయ్యెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కొరటాల శివ దర్శకత్వం కావడంతో సినిమాను కొనడానికి బయ్యర్లు పోటీ పడ్డారు. రెస్టాప్ ఇండియా మినహా అన్ని ఏరియాలకు బిజినెస్ పూర్తయింది. ఇప్పటికే రూ. 61 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రూ. 60 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇదంతా కొరటాల శివ ఎఫెక్టే అని చెప్పక తప్పదు. సినిమా హిట్టయితే రూ. 70 నుండి 80 కోట్ల మేర వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు

,  ,  ,  ,  ,  ,