Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Sep-2017 13:00:12
facebook Twitter Googleplus
Photo

తెరపై సీఎంలు కనిపించి చాలా రోజులైపోయింది. అంటే ముఖ్యమంత్రులు సినిమాల్లో నటించారని కాదు.. ముఖ్యమంత్రి పాత్రలో హీరోలు ఈ మధ్య కనిపించలేదని.. అప్పుడెప్పుడో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ వన్ డే సీఎం పాత్రలో కనిపించి హడావుడి చేసి అదరగొట్టాడు. టాలీవుడ్ కండల వీరుడు రానా తొలి చిత్రంలోనే సీఎం పాత్రలో నటించాడు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన లీడర్ సినిమాలో యంగ్ సీఎంగా కనిపించాడు.

చాలా సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి పాత్ర హీరోగా సినిమా వస్తోంది. ప్రిన్స్ మహేష్ బాబు సీఎం పాత్రలో కనిపించి అభిమాలకు ఆనందం పంచబోతున్నాడు. కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. అన్నపూర్ణ స్టూడియో పెద్ద అసెంబ్లీ సెట్ కూడా వేశారు. ఎమ్మెల్యేలు.. వాళ్ల వెనుక అనుచరులు.. వాళ్ల జేజేలతో షూటింగ్ స్పాట్ హోరెత్తిపోతోంది. రాజకీయ నాయకులంటేనే ఖద్దరు చొక్కాలు.. మెళ్లో కండువాలు కామన్ కాబట్టి షూటింగ్ స్పాట్ లో చాలామంది అదే వేషాల్లో తిరిగేస్తున్నారు. ఓ రకంగా అన్నపూర్ణ స్టూడియో అంతా విపరీతమైన రాజకీయ ఆర్భాటం కనిపిస్తోంది.

భరత్ అనే నేను సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులైనా ఇంతవరకు మహేష్ బాబు స్పైడర్ షూటింగ్ పనుల్లో బిజీగా ఉండిపోయాడు. స్పైడర్ చిత్రీకరణ పనులన్నీ పూర్తయి విడుదలకు రెడీగా ఉంది. కాబట్టి మహేష్ బాబు ఇకపై ఫుల్ టైం భరత్ అనే నేను సినిమాకే కేటాయించనున్నాడు.

,  ,  ,  ,  ,