Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jan-2017 12:14:37
facebook Twitter Googleplus
Photo

హీరోయిన్.. కేవలం హీరోయిన్ గా గ్లామర్ కోసమే నటించడం కాకుండా... కథలో కీలక భూమిక పోషించే పాత్రలు దొరకడం చాలా అరుదు. అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకుంది యామీ గౌతమి. అది కూడా నెగిటివ్ రోల్ కావడం విశేషం! ఈ కీలక పాత్ర చేయడం ద్వారా యామీ తన కెరీర్ లో ఒక కీలకమైన సమయాన్ని అనుభవిస్తున్నట్లే చెబుతున్నారు బాలీవుడ్ జనాలు.

విషయానికొస్తే... వంగవీటి సినిమాతో దర్శకుడిగా వర్మ ఈస్ బ్యాక్ అనుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అది జరగలేదనే చెప్పాలి! ఈ సమయంలో వర్మ హోప్స్ అన్నీ సర్కార్ 3 పై ఉన్నాయనేది నిర్వివాదాంశం. ఈ వెటరన్ డైరెక్టర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం "సర్కార్-3" కోసం తాజాగా యామీ గౌతమిని తీసుకున్నారట. అది కూడా విలన్ పాత్ర కోసం.

అమితాబ్ సినిమా కావడంతో ఆమె కూడా ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదని తెలుస్తుంది. ఈ సినిమాలో తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకోవడానికి వచ్చే యువతి పాత్రలో యామీ నటిస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన యమీ... అమితాబ్ తో నటించాలనే తన కల నెరవేరిందని ఆయనతో నటించే అవకాశం కోసమే ఎదురు చూస్తున్నానని చెప్తుందట. మరి విలన్ రోల్ కదా...? అని ఎవరైనా ప్రశ్నిస్తే... "అమితాబ్ తో నటించడం ముఖ్యం.. అది విలన్ రోలా - హీరోయిన్ రోలా అన్నది ముఖ్యం కాదు" అని తెగేసి చెబుతుందట.

ఇదిలా ఉంటే... హృతిక్ సరసన యామీ నటించిన "కాబిల్" (తెలుగులో బలం) సినిమా వచ్చేవారం విడుదలకానుంది. ఈ సినిమాతో టాప్ స్టార్స్ లిస్ట్ లో యామీ చేరిపోనుందని కథనాలొస్తున్న తరుణంలో నెగిటివ్ రోల్ చేయడానికి ఆమె ముందుకు రావడంతో నటిగా మంచి మార్కులు కొట్టేయడం గ్యారెంటీ అంటున్నారు!

,  ,  ,  ,  ,