Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

01-Aug-2016 15:58:38
facebook Twitter Googleplus
Photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న జనతా గ్యారెజ్ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా దూసుకుపోతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా పక్కాగా ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు. ఇక నేటినుంచి ఈ సినిమాకు సంబంధించిన ఓ షెడ్యూల్‌ను టీమ్ కేరళలో మొదలుపెట్టింది. ఈ షెడ్యూల్‌లో కేరళలోని పలు అందమైన లొకేషన్స్‌లో ఎన్టీఆర్, సమంతలపై ఒక పాటను చిత్రీకరించనున్నారు.
?మిర్చి?, ?శ్రీమంతుడు? సినిమాలతో తెలుగులో తనదైన బ్రాండ్ సృష్టించిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా కావడం వల్ల ఎన్టీఆర్ అభిమానులంతా తమ హీరో కెరీర్‌లో ఈ సినిమా అతిపెద్ద హిట్‌గా నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఆగష్టు 12న హైద్రాబాద్‌లో దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఆడియోను పెద్ద ఎత్తున విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

,  ,  ,  ,  ,  ,