Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Jun-2017 11:47:26
facebook Twitter Googleplus
Photo

విడుదల తేదీ మార్పులు చేర్పులు సర్వ సాధారణం అయిపోయాయి. ఎందుకంటే ఒకేసారి స్టార్స్ సినిమాలు వస్తే అటు థియేటర్లు దొరకవు ఇటు ప్రేక్షకులుకు ఏ సినిమాను చూడలో నిర్ధారించుకోవడం కష్టం అవుతుంది కదా. పోటీపడి తొందరపడి విడుదల చేయడం వలన సినిమాకు కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే ఆగష్టులో ఒకే సారి విడుదలకాబోతున్న సినిమాలలో రెండు సినిమాలో ఒకటి ముందుకు మరొకటి మరింత వెనకకు జరిగాయి. ఆ వెనక్కు వచ్చిన సినిమానే సాయ్ ధరమ్ తేజ్ నటిస్తున్న ‘జవాన్’.

అసలు ఈ సినిమా ఆగష్టు నెలలో విడుదల కావలిసింది. కానీ సెప్టెంబర్ 1 కి మార్చడం జరిగింది. ఇదే సెప్టెంబర్ 1 నాడు ఎన్టీఆర్ తన కొత్త సినిమా జై లవ కుశ తో రావాలి అనుకున్నాడు కానీ లాంగ్ వీకెండ్ కోసం సెప్టెంబర్ 21 నాడుకి వెళ్లిపోయాడు. దానితో ఆ తేదీ ఖాళీగా ఉండటంతో జవాన్ చిత్ర యూనిట్ సెప్టెంబర్ 1నే ఫైనల్ చేశారు. జవాన్ లాంటి వాడు మన దేశానికి ఒకడు మన ఇంటిలో ఒకడు ఉండటం ఎంత అవసరమో చెబుతుంది ఈ సినిమా. అందుకే ఈ సినిమాకు ఉప శీర్షిక కూడా జవాన్ – ఇంటిలో ఒక్కడు అని పెట్టారు అని తెలిపారు డైరెక్టర్ రవి. కథ బలం ఉన్న ఈ సినిమాకు అన్నీ కమర్షియల్ ఫ్యామిలి అంశాలు జోడించి పూర్తి ఎంటర్టైన్మెంట్ సినిమాగా తయారుచేశారు అని చెబుతున్నారు జవాన్ సినిమా యూనిట్.

సాయ్ ధర్మ్ తేజ్ హీరోగా మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను బివియెస్ రవి డైరక్షన్ చేస్తున్నాడు. వరుస ఫ్లాప్ సినిమాలు తో సతమతం అవుతున్న మెగా స్టార్ మేనల్లుడు ఈ సినిమా పై చాల ఆశలు పెంచుకున్నాడు.

,  ,  ,  ,  ,  ,