Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2017 12:25:19
facebook Twitter Googleplus
Photo

శ్రీనివాస్-బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదలైన కొత్త సినిమాకు సంబంధించిన ఎప్పుడో పోయినేడాది ఆఖర్లో ఒక ప్రి లుక్ రిలీజ్ చేశారు. తర్వాత చాలా విరామం తర్వాత ఈ మధ్యే టైటిల్ లోగో లాంచ్ చేశారు. అవి రెండూ పాజిటివ్ రెస్పాన్సే తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ బయటికి వచ్చింది. ఇది కూడా మంచి ఫీలింగే ఇస్తోంది. తన మాస్ స్టయిల్ కు భిన్నంగా జయ జానకి నాయక అంటూ పొయెటిక్.. క్లాస్ టైటిల్ పెట్టి ఆశ్చర్యపరిచిన బోయపాటి.. ఫస్ట్ లుక్ విషయంలోనూ అలాగే షాకిచ్చాడు. హిల్ స్టేషన్లో రోడ్డుపై బైక్ నిలబెట్టి రకుల్ అలా నిలుచుని ఉంటే.. శ్రీనివాస్ రోడ్డుపైనే కూర్చుని ఏదో చూపిస్తున్నాడు. ఒక ప్లెజెంట్ లవ్ స్టోరీని తలపించేలా ఉంది ఈ చిత్ర ఫస్ట్ లుక్.

ఇది అసలు బోయపాటి సినిమానేనా అనే ఫీలింగ్ కలిగించేలా ఉంది ఫస్ట్ లుక్. బోయపాటి నుంచి ఈసారి కొత్తగా ఏమైనా ఆశించొచ్చేమో అనిపిస్తోంది. సాహసం శ్వాసగా సాగిపో తో నిర్మాతగా పరిచయమైన మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా జయ జానకి నాయక. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఇందులో రకుల్ ప్రీత్ సింగ్.. ప్రగ్యా జైశ్వాల్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో జగపతి బాబు.. శరత్ కుమార్.. వాణీ విశ్వనాత్.. ఇలా భారీ తారాగణమే ఉంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నందిస్తున్నాడు. బోయపాటి స్టయిల్లో ఈ చిత్రానికి భారీగానే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. ఆగస్టు 11న జయ జానకి నాయక ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.

,  ,  ,  ,  ,