Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

23-Aug-2017 10:52:02
facebook Twitter Googleplus
Photo

సినిమాను ఎంతగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తే అంత బెటర్ అని ముందునుండి గట్టి పబ్లిసిటీయే చేశాడు. ఇక సినిమా ధియేటర్లలోకి వెళ్ళి ఆడుతున్నా కూడా.. కలక్షన్ల కోనం ఇంకా కష్టపడుతున్నాడు. అదిగో అలాంటి ఫీట్ ఒకటి చూడండి మీకే అర్ధమవుతుంది.

ఆల్రెడీ 10 రోజుల్లో 19+ కోట్ల షేర్ వసూలు చేసిన జయ జానకి నాయక సినిమా సక్సెస్ మీట్ ఒకటి హైదరాబాదులో జరిగింది. ఆ తరువాత మళ్ళీ అలాంటి వేడుకే ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశం తీసిన హంసలదీవిలో ఒకటి పెట్టారు. కట్ చేస్తే ఇప్పుడు మరోసారి హైదరాబాదులో జయ జానకి నాయక సక్సెస్ మీట్ పెడుతున్నారట. అంతేకాదు.. మొన్న ఆదివారం ఓ మాల్ లో జరిగిన సింగింగ్ కాంపిటీషన్ కు బోయపాటి అతిథిగా వెళ్ళాడు. అలాగే వేరే చోట్లకు కూడా వెళ్తున్నాడు. ఒంటిచేత్తో సినిమాను భలే ప్రమోట్ చేస్తున్నాడు. కాకపోతే వసూళ్ళు ఎంతవరకు పెరుగుతాయో తెలియదు కాని.. మనోడు మాత్రం సక్సెస్ మీట్లు అంటూ వారానికోసారి బాగానే పలకరిస్తున్నాడు.

మొత్తానికి సినిమాను తీశామా.. తినేసి పడుకున్నామా.. అంటూ ఆలోచించే స్టార్ డైరక్టర్లు ఉన్నరోజుల్లో బోయపాటి ప్రమోషన్స్ చేస్తున్న తీరు నిజంగానే చాలా అభినందనీయం.

,  ,  ,  ,  ,