Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

17-Nov-2017 14:51:14
facebook Twitter Googleplus
Photo

మూడేళ్లుగా ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచిన నంది అవార్డుల్ని ఏపీ సర్కారు ప్రకటించటం తెలిసిందే. ఈ అవార్డుల ప్రకటనపై తెలుగు చిత్రపరిశ్రమలో భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. అవార్డుల ప్రకటన దారుణంగా ఉందని.. తప్పుల తడకతో ఉందని.. కమ్మ లాబీయింగ్ ప్రభావానికి నంది అవార్డుల జ్యూరీ గురైందని.. ఒక ప్రముఖ హీరో వ్యక్తిగత ఇష్టాయిష్టాలే నంది అవార్డుల ప్రకటనలో కీలకభూమిక పోషించాయని.. నంది అవార్డుల్ని తన కనుసన్నల్లో ఫైనల్ అయ్యేలా ఒక ప్రముఖ హీరో వ్యవహరించారన్నది ఇప్పుడు తాజా ఆరోపణ.

నంది అవార్డుల్ని పక్షపాతంతో ప్రకటించారన్న విమర్శలు చేసిన నేపథ్యంలో ఒక ప్రముఖ ఛానల్ లో ఒక భారీ చర్చ జరిగింది. బిగ్ డిబేట్ పేరిట జరిగిన ఈ చర్చాకార్యక్రమంలో పలువురు నిర్మాతలు పాల్గొన్నారు. ఇందులో తమ ఆగ్రహాన్ని బలంగా వినిపించింది ఇద్దరే ఇద్దరు. ఒకరేమో నల్లమలుపు బుజ్జి.. మరొకరు బండ్ల గణేశ్.

ఈ చర్చను నిర్వహించిన ఛానల్ ప్రతినిధి మాట్లాడుతూ.. అక్కినేని కుటుంబానికి అవార్డు రాకపోవటం వెనుక.. బాలకృష్ణకు.. నాగార్జునకు మధ్యనున్న విభేదాలే కారణమని వ్యాఖ్యానించటం.. దానికి చర్చలో పాల్గొన్న వారెవరూ రియాక్ట్ కాలేదు. అయితే.. బండ్ల గణేశ్ మాత్రం కాస్త రియాక్ట్ అయ్యారు. మొదట తనకు తెలీదన్న ఆయన తర్వాత జరిగిన చర్చ నేపథ్యంలో బాలయ్య.. నాగ్ ల మధ్య విభేదాలు ఉన్నాయన్న మాటను పరోక్షంగా ఒప్పుకున్నారు.

ఇక.. అవార్డుల ఎంపిక మొత్తం బాలకృష్ణ కనుసన్నల్లో జరిగిందా? అన్న ప్రశ్నకు బండ్ల గణేశ్ సూటిగా స్పందించలేదు. ఎందుకు మమ్మల్నే ప్రశ్నలు అడుగుతారంటూ ఆగ్రహం ప్రదర్శించారు.

మమ్మల్నే ఎందుకు అడుగుతారు గురువుగారు. అసలు విషయం మీకు తెలీదా? మా నోటితోనే చెప్పించాలా? అని వ్యాఖ్యానించారు బండ్ల గణేశ్. దీనికి చర్చను నిర్వహించిన ఛానల్ ప్రతినిధి.. ఉన్నది ఉన్నట్లు ఓపెన్ చేయకుండా ఎందుకు దాస్తారంటూ టీజింగ్ గా మాట్లాడారు. అన్ని తెలిసిన మీరు మమ్మల్ని ప్రశ్నించటం ఎందుకు.. మీరే చెప్పొచ్చుగా కదా అని బండ్ల వ్యాఖ్యానించారు. ఇలా సాగిన సంవాదం చివరకు కంక్లూజన్ చేస్తూ.. బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందాక నా చేత చెప్పించారు.. మీరు అనౌన్స్ చేశారు. మళ్లీ ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఇందాక చెప్పిందే ఇప్పుడు కూడా.

,  ,  ,  ,  ,