Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

29-Sep-2016 11:30:21
facebook Twitter Googleplus
Photo

బాలీవుడ్లో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న అక్షయ్ కుమార్.. అజయ్ దేవగన్ లాంటి హీరోలు రూటు మార్చి కామెడీలు చేయడం మొదలుపెట్టాక అక్కడ రెగ్యులర్ గా యాక్షన్ సినిమాలు చేసే హీరోలు తగ్గిపోయారు. ఈ లోటును జాన్ అబ్రహాం అప్పుడప్పుడూ తీర్చే ప్రయత్నం చేస్తున్నాడు. గత కొన్నేళ్లలో అతను ఫోర్స్.. రాకీ హ్యాండ్సమ్ లాంటి యాక్షన్ సినిమాలు చేశాడు. ఇప్పుడు ?ఫోర్స్-2?తో రాబోతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ?ఫోర్స్? తరహాలోనే ఇందులోనూ భీభత్సమైన యాక్షన్ ఉంటుందని పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ఫోర్స్ అప్పట్లో మంచి విజయమే సాధించింది.

?ఫోర్స్-2?లో జాన్ అబ్రహాం రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు. నిజానికి సినిమా పేరు ?ఫోర్స్-2? కాదు.. ఫోర్స్ స్క్వేర్. తొలి భాగం కంటే యాక్షన్ డోస్ ఇందులో ఎక్కువే ఉంటుందట. ?ఫోర్స్? తమిళ బ్లాక్ బస్టర్ మూవీ ?కాక్క కాక్క?కు రీమేక్. ఆ సినిమానే తెలుగులోకి ?ఘర్షణ? పేరుతో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ?ఫోర్స్?లో జాన్ అబ్రహాం సరసన జెనీలియా నటించింది. సీక్వెల్లో అతడితో సోనాక్షి సిన్హా జత కడుతోంది. ఢిల్లీ బెల్లీ.. గేమ్ లాంటి సినిమాలు తీసిన అభినయ్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ?ఫోర్స్ స్క్వేర్? అని పేరు పెట్టుకున్నారు కానీ.. తొలి భాగానికి భిన్నంగా ఈ కథ సాగుతుందట. నవంబరు 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

,  ,  ,  ,  ,  ,  ,