అగ్ర కథానాయికలుగా వెండితెరపై ఒక వెలుగు వెలిగిన వాళ్లు, ఆ తరువాత పెళ్లి .. పిల్లలంటూ తమ కెరియర్ కి దూరమవుతూ వుండటం సహజంగా జరుగుతూ వుంటుంది. ఆ తరువాత పిల్లలు కాస్త ఎదిగాక మళ్లీ మేకప్ వేసుకుని రంగంలోకి దిగినవాళ్లూ వున్నారు. అలా సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన వాళ్లలో చాలా తక్కువమంది మాత్రమే తిరిగి విజయాన్ని సాధించగలిగారు. అలాంటి కొంతమందిలో జ్యోతిక కూడా చేరిపోయింది. కొంతకాలం గ్యాప్ తరువాత ఆమె నటించిన తమిళ్ చిత్రం '36 వయదినిలే' హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన ఆరు రోజులలోనే 8 కోట్లు వసూలు చేసింది.
jyothika, 36, dubbed, tollywood, news, sucess,