Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-May-2015 11:46:41
facebook Twitter Googleplus
Photo

కమలహాసన్ కు తమిళంలో ఎంతమంది అభిమానులున్నారో, అదే స్థాయిలో తెలుగులో కూడా వున్నారని చెప్పచ్చు. తన కెరీర్ తొలినాళ్ల నుంచీ ఆయన తెలుగు సినిమాలలో నటిస్తూ వుండడం వల్ల, తెలుగునాట కూడా ఆయన సమాన ఆదరణ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా డైరెక్టుగా తెలుగు సినిమాను చేస్తున్నారు. తన అసోసియేట్ రాజేష్ దర్శకత్వంలో ఆయన నటించే చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని కమల్ స్వయంగా చెప్పారు. దీని షూటింగ్ ఈ నెల 24న హైదరాబాదులో మొదలవుతుందని కమల్ తెలిపారు. థ్రిల్లర్ గా రూపొందే ఈ చిత్రం షూటింగును నలభై రోజుల పాటు హైదరాబాదులోనూ, మరో నలభై రోజుల పాటు చెన్నయ్ లోను నిర్వహిస్తారు. జిబ్రాన్ సంగీతాన్ని సమకూర్చే ఈ చిత్రానికి తమిళంలో 'తూంగావనం' అనే టైటిల్ నిర్ణయించారు.

,  ,  ,  ,  ,