Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

22-Sep-2015 17:09:11
facebook Twitter Googleplus
Photo

షారూక్ - మహేష్ - రామ్ చరణ్ - నారా రోహిత్ .. వీళ్లంతా ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరణల్లో బిజీ. అసలు ఎవరేం చేస్తున్నారు? అన్నది ఆరాతీస్తే...

* మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం పాటను ఓ భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఇంటిల్లిపాదీ కనిపించే ఈ పాట కలర్ ఫుల్ గా సాగుతుందని చెబుతున్నారు. రాజుసుందరం కొరియోగ్రఫీలో తెరకెక్కిస్తున్న ఈ పాటను ఈనెల 28 వరకూ తెరకెక్కిస్తారు.

*రామ్ చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్ లీ కీలక సన్నివేశాల్ని రామోజీ పిలింసిటీలో ఫ్లెక్స్ హౌస్ లో తెరకెక్కిస్తున్నారు. షాయాజీ షిండే సహా ప్రధాన తారాగణంపై ఈ సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. బ్రూస్ లీ పాటలు అక్టోబర్ 2న రిలీజవుతున్న సంగతి తెలిసిందే.

* షారూక్ ఖాన్ - కాజోల్ జంటగా రోహిత్ శెట్టి తెరకెక్కిస్తున్న దిల్వాలే రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కుతోంది. షారూక్ ఖాన్ - వరుణ్ ధావన్ - బొమన్ ఇరానీ .. తదితరులపై ఓ ఇంట్లో జరిగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఫిలింసిటీ స్మాల్ టౌన్ ఏరియాలో వేసిన ఇల్లు సెట్ లో ఈ సీన్స్ తెరకెక్కుతున్నాయి.

* నారా రోహిత్ హీరోగా గుండెల్లో గోదారి ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. రామోజీ ఫిలింసిటీలోని కాఫీ డే లో చిత్రీకరణ సాగుతోంది. నలుగురు స్నేహితులతో సరదాగా కాపీ తాగే సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారిక్కడ. హీరో రోహిత్ - హీరోయిన్ లతా హెగ్డే సహా స్నేహితులతో సీన్ ఇది.

,  ,  ,  ,