Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

18-Jul-2017 14:56:50
facebook Twitter Googleplus
Photo

కాబిల్ కు అరుదైన ఖ్యాతి దక్కనుంది. యామీ గౌతమ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హృతిక్ అంధుడిగా నటించాడు. తన జీవిత భాగస్వామిని దూరం చేసిన వారిపై అంధుడైన వ్యక్తి ఎలాంటి ప్రతీకారం తీర్చుకుంటాడన్నదే ఈ కథాంశం. ఈ సినిమాలో హృతిక్ నటనకు మంచి పేరు వచ్చింది. సినిమాకు ప్రేక్షకాదరణ కూడా బాగానే లభించింది.

కాబిల్ సినిమాను ఫాక్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ ఇంగ్లీష్ లో రీమేక్ చేయాలని భావిస్తోంది. కాబిల్ దర్శకుడు సంజయ్ గుప్తా ఈ విషయం వెల్లడించాడు. ఇంతవరకు హాలీవుడ్ సినిమా కథలతో బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని అధికారికమైతే... కొన్ని అనధికారికంగా ఎత్తేసినవి ఉన్నాయి. కానీ ఇంతవరకు హిందీ సినిమాను ఇంగ్లీష్ లో రీమేక్ చేసిన దాఖలాలు లేవు. అన్నీ అనుకున్నట్లు పూర్తయితే కాబిల్ కే ఆ ఖ్యాతి దక్కుతుంది. ఇంకో విశేషమేమిటంటే ఇంగ్లీష్ వెర్షన్ లోనూ హృతిక్ నటించే అవకాశం ఉంది. కాకుంటే ఇది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు. హృతిక్ ప్రస్తుతం ఫ్యామిలీతో న్యూయార్క్ టూర్ లో ఉన్నాడు. అక్కడి నుంచి వచ్చాక ఈ సినిమా గురించి అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చే అవకాశముంది.

హృతిక్ అంతకుముందు కత్రినా కైఫ్ హీరోయిన్ గా బ్యాంగ్ బ్యాంగ్ అనే సినిమా చేశాడు. ఇది టామ్ క్రూజ్ నటించి నైట్ అండ్ డే సినిమాకు అఫీషియల్ రీమేక్.

,  ,  ,  ,  ,