Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

19-Jul-2016 11:45:00
facebook Twitter Googleplus
Photo

కబాలి చిత్రం వెబ్‌సైట్లను చావుదెబ్బ తీసిందా? దీనికి అవుననే సమాధానమే వస్తోంది. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కబాలి. భారీ అంచనాల మధ్య ఈ చిత్రం ఈ నెల 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా చిత్రపరిశ్రమను ఒక పక్క పైరసీ, మరో పక్క అనధికార ఆన్‌లైన్ సినీ ప్రచారాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల కబాలి చిత్ర నిర్మాత కలైపులి ఎస్.థాను కబాలి చిత్రాన్ని ఆన్‌లైన్‌లోనూ, ఆమ్ని బస్సుల్లోను ప్రసారం చేయకుండా నిరోధించాలని, అలాంటి వెబ్‌సైట్‌లపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అలాంటి వాటిపై నిషేధం విధించాలని వెబ్‌సైట్ల నియంత్రణ శాఖను ఆదేశించాలని ఆ పిటీషన్‌లో కోరారు. ఆ పిటీషన్‌ను విచారించిన నాయ్యుమూర్తి ఎన్.కృపాకరన్ అలాంటి వెబ్‌సైట్‌లను మూసివేయాలని వెబ్‌సైట్ నియంత్రణ అధికారులకు ఆధేశాలు జారీ చేశారు. దీంతో తమిళ రాక్కర్స్, తమిళ టోరంటో, తమిళ డీవీడీ.కామ్ వంటి వెబ్‌సైట్స్ మూతపడుతున్నాయి. ఈ విధంగా వెబ్‌సైట్లపై కబాలి చిత్రం పంజా విసిరింది. అయితే వీటి వేరే లింక్ ద్వారా కబాలి చిత్రాన్ని చూడవచ్చుననే ప్రచారం వాట్సాప్‌లలో హల్‌చల్ చేస్తుండడం చిత్రపరిశ్రమ వర్గాలను నివ్వెర పరుస్తోంది.

,  ,  ,  ,  ,