Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

14-Aug-2017 13:58:11
facebook Twitter Googleplus
Photo

తెలుగు అమ్మాయిలు నటించడం ముందు ముందు అసలు జరగదుఏమో ఎందుకంటే నార్త్ అమ్మాయిలు హవా రోజుకు రోజుకు పెరుగుతూ వస్తుంది. అయితే ఈ విమర్శను నార్త్ హీరోయిన్లు కానీ పక్క రాష్ట్ర హీరోయిన్లు కానీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. అందుకే వాళ్ళు నటిస్తున్న మొదటి సినిమాలోనే వాళ్ళ మాటలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకునే స్థాయికి కష్టపడుతున్నారు. ఫిదా సినిమాలో సాయి పల్లవి తన తెలంగాణ యాస తెలుగు నేర్చుకొని సినిమా విజయంలో మంచి పాత్ర పోషించింది. అదే బాటలో మరో నార్త్ అమ్మాయి నడుస్తోంది.

అర్జున్ రెడ్డి అనే తెలుగు సినిమాలో శాలిని పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ఈ అమ్మాయి ఒక మెడికల్ స్టూడెంట్ గా నటించింది. మధ్యప్రదేశ్ లో పుట్టి జబల్ పూర్ లో పెరిగిన శాలిని పాండే ఈ సినిమాలో మంగుళూరు నుండి వచ్చిన అమ్మాయిగా కనిపించనుంది. అయితే డైరెక్టర్ సూచన మేరకు అర్జున్ రెడ్డి సినిమాలో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుందట ఈ సుందరి. తెలుగులో ఆమెకు అర్జున్ రెడ్డి మొదటి సినిమా అయినా మధ్యప్రదేశ్ లో థియేటర్ ఆర్టిస్టుగా మంచి అనుభవం ఉందట. అందుకే అమ్మడు తెలుగులో డైలాగులో అలవోకగా చెప్పేసింది.

అవకాశాలు నిలబెట్టుకోవడానికి నార్త్ అమ్మాయిలు తెలుగు తొందరగా నేర్చుకొని ఇప్పుడు ఉన్న హీరోయిన్లుకు గట్టి పోటీనే ఇస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్ తెలుగు మాట్లాడుతుంటే ఆ సినిమాకు కూడా మంచి ప్రచారం దొరుకుతుంది లెండి. అందుకే మన డైరెక్టర్లు ఆ హీరోయిన్లకు దగ్గర ఉండి మరి నేర్పిస్తున్నారు. తెలుగు నేర్చుకోవాలిని చేసినట్లు లేదు ఇది ఆ సినిమా ప్రచారం కోసం చేసినట్లు కనిపిస్తుంది.

,  ,  ,  ,  ,  ,