Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

30-Jun-2016 15:34:37
facebook Twitter Googleplus
Photo

రజనీకాంత్ నటించిన కబాలి చిత్రంపై ఏ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిత్ర నిర్మాతలు మూవీ ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇండియన్ సినిమాలో ఏ సినిమాకు చేయని రేంజ్‌లో కబాలి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు .ఇన్నాళ్ళు ఆటోలు, బస్సులు, ట్రైన్స్ పై మాత్రమే సినిమాకు సంబంధించిన పోస్టర్స్ చూశాం. కాని తాజాగా విమానాలపై కూడా సినిమా పోస్టర్‌లు దర్శనమివ్వడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మరి ఈ వ్యవహారానికి శ్రీకారం చుట్టింది ఎవరో కాదు సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన నటించిన కబాలి చిత్ర పోస్టర్స్ ఎయిర్ ఏషియా విమానాలపై కనిపిస్తుండగా, వీటిని ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
ఇక ఎయిర్ ఏషియా సంస్థ అయితే అభిమానులకు ఏకంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది.?ప్లై లైక్ ఏ సూపర్ స్టార్? అనే కాన్సెప్ట్‌తో ఎయిర్ ఏషియా జూలై 3 వరకు ఆన్‌లైన్లో కొన్ని ప్రత్యేక బుకింగ్స్‌ని ఓపెన్ చేసింది. అసలు రేట్ కంటే తక్కువ ధరకే ఆ సంస్ధ వారు ఈ బుకింగ్స్ ఇవ్వడం విశేషం. అయితే కబాలి చిత్రం కోసం ఇండియాలోనే కాదు ప్రక్క దేశాలలోని రజనీ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

,  ,  ,  ,  ,