Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

20-Jul-2016 10:25:41
facebook Twitter Googleplus
Photo

దేశానికి ఇప్పుడు 'కబాలి' 'ఫీవర్' పట్టుకుంది. శుక్రవారం 'కబాలి' థియేటర్లలో గ్రాండ్‌గా అడుగుపెట్టబోతుండటంతో సౌతిండియా మొత్తం రజనీ నామస్మరణలో మునిగిపోయింది. అటు ఉత్తర భారతంలోనూ 'కబాలి'పై భారీ హైప్ క్రియేట్ అయింది. అమెరికాతోపాటు అనేక దేశాల్లోనూ 'కబాలి' 22న వెండితెరపై దర్శనమివ్వబోతున్నది.

సర్వత్రా 'కబాలి' మాయా కమ్ముకున్న వేళ ఈ చిత్ర నిర్మాత థాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రజనీ సినిమా రూ. 500 కోట్లకుపైగా వసూలు చేయడం ఖాయమని ప్రకటించి మరింత అంచనాలు రేపారు. మొత్తానికి పెద్దగా ప్రచారం చేయకపోయినా ప్రజల్లోకి భారీ అంచనాలతో వెళుతున్న ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలివి..

1. 'కబాలి' వందకోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. దక్షిణాది సినిమాల వరకు ఇది భారీ బడ్జెట్ అనే చెప్పాలి. కానీ, 'కబాలి' మానియాను చూస్తుంటే.. మొదటి రెండు, మూడు రోజుల్లోనే ఈ సినిమా 200 కోట్ల కలెక్షన్లను దాటే అవకాశముందని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. రజనీ కబాలి.. సల్మాన్ సుల్తాన్‌ను అధిగమించడం ఖాయమని వినిపిస్తోంది. 'కబాలి' ట్రైలర్‌ను రెండున్నర కోట్లమంది వీక్షించారు. ఈ రికార్డును 'సుల్తాన్' టీజర్ అందుకోలేకపోయింది. 'కబాలి' వస్తే సుల్తాన్ వసూళ్లు తగ్గిపోయే అవకాశముంది. అమెరికా, ఫ్రాన్స్, చైనా, జపాన్, ఇండోనేషియా, మలేషియా తదితర దేశాల్లో 'కబాలి' విడుదల కానుంది. అమెరికాలో ఏకంగా 400 థియేటర్లలో 'కబాలి' హల్‌చల్ చేయనున్నాడు. రజనీ రాకతో సుల్తాన్ థియేటర్లు తగ్గిపోనున్నాయి.
2. టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్‌లోనూ 'కబాలి' సంచనాలు సృష్టిస్తున్నాడు. ఈ నెల 15న తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. చెన్నైలోని చాలా థియేటర్లలో ఆదివారం వరకు టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. చెన్నైలోని ఎస్పీఐ సినిమా హాల్‌లోని మొత్తం 27తెరల్లోనూ 'కబాలి' సినిమానే ప్రదర్శించనున్నారు. రోజుకు 96 షోలు వేయనున్నారు. అయినా ఈ హాల్‌కు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ టికెట్లు ఆదివారం వరకు అమ్ముడుపోవడం గమనార్హం.

3. చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ ఫైండ్ అస్ ఇండియా.. 'కబాలి' విడుదల రోజున తన ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. అదే దారిలో నడుస్తూ బెంగళూరుకు చెందిన ఇన్నోవేటివ్ స్ట్రక్చరల్ సోల్యుషన్స్ కంపెనీ కూడా తన ఉద్యోగులకు లీవ్ ఇచ్చింది. 'కబాలి' సినిమా చూసేందుకు ఉద్యోగులు ఎక్కడ మూకుమ్మడిగా సిక్ లీవులు పెడతారోనన్న భయంతో ఆ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ కంపెనీల నిర్ణయం ట్విట్టర్‌లో హల్‌చల్ చేస్తోంది. కబాలి లీవ్‌లేటర్
3. తమిళనాడు హోసూరుకు చెందిన ఓ మారుతీ డీలర్ రజనీ అభిమానులను ఆకట్టుకునేందుకు 'కబాలి' కార్లను అమ్ముతోంది. మారుతి స్విఫ్ట్ కార్లను 'కబాలి' పోస్టర్లతో డిజైన్ చేసి అందిస్తోంది. ఇక ఎయిర్ ఆసియా కంపెనీ శుక్రవారం సినిమా విడుదల రోజున 'కబాలి' ఫ్లయిట్‌ను నడుపనుంది. అంతేకాకుండా ఈ విమానంలో ప్రత్యేక కబాలి మీల్స్‌ను అరెంజ్ చేశారు.

5. రజనీ అభిమానుల కోసం శుక్రవారం ఉదయం 5 గంటలకే షో వేస్తున్నారు. ఈ షోలకు సంబంధించిన అన్ని టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. ఇక అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించిన రెండుగంటల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా ఎగిరిపోయాయి.

6. కబాలి మానియా దేశాన్ని ఇంతగా ఊపేస్తున్నా రజనీ మాత్రం అమెరికాలో ఉన్నారు. తన సహజ ఆధ్యాత్మిక ధోరణిలో యోగవిల్లే సచ్చిదానంద ఆశ్రమాన్ని ఆయన దర్శించుకున్నారు.

,