Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

09-Oct-2017 13:12:52
facebook Twitter Googleplus
Photo

మోహన్ బాబు ఎంతటి కీర్తి గడించారని చెప్పేందుకు మాటలు చాలవు. తెలుగు నటీనటుల్లో డైలాగ్ డెలివరీలో మేటి అగ్రగణ్యుల్లో ఒకరు ఆయన. అలాంటి మోహన్ బాబు.. తన కుమార్తెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంలోనూ విలక్షణత చూపించడంలో ఆశ్చర్యమేమీ లేదు.

నిన్న అంటే అక్టోబర్ 8న మోహన్ బాబు ముద్దుల కుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తగా.. అన్నిటిలోకీ తండ్రి చేసిన ట్వీట్ నే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కూతురు చిన్నప్పుడు తనే ఎత్తుకుని దిగిన ఓ ఫోటోను పోస్ట్ చేశారు మోహన్ బాబు. ముద్దులొలికే ఆ చిన్నారే.. ఇప్పటి మంచి లక్ష్మి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోహన్ బాబు కూడా యంగ్ ఏజ్ లో మెరిసిపోతున్నారు లెండి. అలనాటి ఫోటోను.. ఇప్పుడు చూపిస్తూ.. అందరినీ ఆశ్చర్యపరిచారు మోహన్ బాబు. తనకు కుమార్తె పుట్టిన తర్వాతే తన జీవితం మలుపు తిరిగిందని.. తమ ఇంటి మహాలక్ష్మి.. ఈ లక్ష్మీ ప్రసన్న అని పలు మార్లు మోహన్ బాబు చెబుతూనే ఉంటారు. సొంత బ్యానర్ కు కూడా లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అంటూ కూతురు పేరునే పెట్టుకున్న సంగతి తెలిసిందే.

మా ఇంటి లక్ష్మి.. నా కుమార్తె లక్ష్మీ ప్రసన్నకు జన్మదిన శుభాకాంక్షలు

,  ,  ,  ,  ,