Photo Shoot : Amy Jackson   Movie Teaser: Naa Nuvve

11-Apr-2016 17:54:57
facebook Twitter Googleplus
Photo

ఒకటే ప్రశ్నకు.. ఒక్కో ఇంటర్యూలో ఒక్కో విధంగా స్పందిస్తే.. దానిని ఒక్కొక్కరూ ఒక్కోసారి ఒక్కో విధంగా విశ్లేషణలు కల్పిస్తున్నారు. సరిగ్గా ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో అదే జరుగుతోంది.

ఒక టివి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో.. అసలు ఏప్రియల్ 8న తన కొడుకు అకీరా పుట్టిన రోజు అనే గుర్తులేదని.. అసలు 8న పుట్టినరోజు అనే విషయాన్ని మర్చిపోయానని.. చెప్పుకొచ్చాడు పవన్. దీన్ని బట్టి ఎనాలసిస్ చేసి.. పవన్ చాలా ఇన్సెన్సిటివ్ అని తేల్చాశారందరూ. కాని ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం.. ''ఏప్రియల్ 8న రిలీజ్ కాబట్టి.. బర్త్ డే గురించి మర్చిపోయాను. కాని సాయంత్రం వాడికి ఫోన్ చేసి విషెస్ చెప్పాను. వాళ్ళను కలసి నాలుగు నెలలు అయ్యింది. పిల్లలు కూడా బెంగ పెట్టుకున్నారు. వచ్చే వారం పూణె వెళ్లి వాళ్లని కలసి వస్తా'' అంటూ సెలవిచ్చాడు పవన్. వర్క్ ప్రెజర్ లో ఒక్కోసారి బర్తడే లు మర్చిపోవడం సాధారణంగా చాలామంది లైఫ్ లో జరుగుతుంటుంది. అందుకని.. వారందరినీ ఇన్సెన్సిటివ్ అనలేం కదా.

ఇకపోతే పవన్ కళ్యాణ్ అసలు ''సర్దార్''ను ప్రమోట్ చేయడానికి ఇంటర్యూలు ఇస్తూ.. ఈ పర్సనల్ అండ్ పొలిటికల్ విషయాలు మాట్లాడటం అనవసరమేమో. ఇలా ఫోకస్ మార్చి ఏదేదో మాట్లాడటం వలన.. ఒకే ప్రశ్నకు వెరైటీ వెరైటీ ఆన్సర్లు వినాల్సి వస్తుంది.

,  ,  ,  ,  ,  ,